క్యూరేటివ్ పిటిషన్లను కొట్టివేసిన సుప్రీం
న్యూఢిల్లీ జనవరి 13
నిర్భయ దోషుల క్యూరేటివ్ పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. నిర్భయ దోషులు వినయ్, ముఖేశ్ క్యూరేటివ్ పిటిషన్లు దాఖలు చేశారు. వాటిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఆ పిటిషన్లను కొట్టివేసింది. జస్టీస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బెంచ్ పిటిషన్లను విచారించింది. పిటిషన్లను కొట్టివేయడంతో దీనితో నిర్భయ దోషులను ఉరి తీయడానికి మార్గం సుగమమైంది. నిర్భయ దోషులు ముఖేష్ సింగ్ (32), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26), అక్షయ్ (31)లను ఈ నెల ఈ నెల 22వ తేదీ ఉదయం 7 గంటలకు ఉరి తీయాలని ఢిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. ఏడేళ్ల క్రితం నిర్భయపై సామూహికంగా అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మరోవైపు, నిర్భయ తల్లి మీడియాతో మాట్లాడుతూ నిందితులను జనవరి 22న వారిని ఉరి తీయడం ఖాయని, ఆ రోజే తన కూతురు నిర్భయకు న్యాయం జరుగుతుందని చెప్పారు. ఊతి తీతకు ఒక వారం రోజుల గడువే వుండడంతో నిందితులకు రాష్ట్ర