YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

టీఆర్‌ఎస్ ప్రభుత్వ అండతో ఎంఐఎం గూండాగిరి: ఎంపీబండి

టీఆర్‌ఎస్ ప్రభుత్వ అండతో ఎంఐఎం గూండాగిరి: ఎంపీబండి

టీఆర్‌ఎస్ ప్రభుత్వ అండతో ఎంఐఎం గూండాగిరి: ఎంపీబండి
హైదరాబాద్ జనవరి 14   
 భైంసా ఘటనపై బీజేపీ నేత, కరీంనగర్ ఎంపీబండి సంజయ్ మండిపడ్డారు. హిందూ ధర్మ రక్షకుల మీద ఒక ప్రణాళిక ప్రకారం దాడి చేశారని ఆయన ఆరోపించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ అండతో ఎంఐఎం గూండాలు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. పోలీసుల మీద కూడా దాడి జరిగినా శాంతి భద్రతల పేరు చెబుతూ వాళ్లకే కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. హిందువులంతా గర్జిస్తే ఏం జరుగుతుందో ఊహించుకోండని ధ్వజమెత్తారు. ఈ మేరకు ట్విటర్ ఖాతాలో ఓ వీడియో పోస్టు చేశారు.‘హిందూ ధర్మ పరిరక్షణ కార్యకర్తలపై విచక్షణా రహితంగా దాడి చేశారు. ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. హత్యలు చేస్తున్నారు. హిందూవాహిని కార్యకర్తల మీద దాడి చేసి ఇవాళ మేమేదో సాధించామని గొప్పగా భావిస్తే.. దేశవ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా ప్రతి హిందువూ సింహమై గర్జిస్తాడు’ అని బండి సంజయ్ హెచ్చరించారు.హిందూ సంస్థలపై, హిందూ ధర్మ పరిరక్షకులపై పక్షపాతంగా వ్యవహరించడం సిగ్గుచేటని బండి సంజయ్ దుయ్యబట్టారు. ‘హిందువైన కార్యకర్తలెవరూ రాజకీయ నాయకులు కాదు. ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తులు కాదు. హిందూ ధర్మ రక్షణ కోసం, హిందూ సమాజం సంఘటితం కోసం పనిచేసిన కార్యకర్తలు. అలాంటి వారి మీద దాడి చేస్తారా?’ అని ఆయన ప్రశ్నించారు.‘ఇండ్లను కాలుస్తారా మీరు? 18 ఇళ్లను దగ్ధం చేస్తారా? ప్రభుత్వం ఏం చేస్తోంది? సమాధానం చెప్పాలి. మేం స్పందిచం, మాకు అవసరం లేదు అని టీఆర్‌ఎస్ పార్టీ భావిస్తే.. ఆ పార్టీకి పుట్టగతులు ఉండవు’ అని సంజయ్ ధ్వజమెత్తారు. ఎంఐఎం గూండాల సంగతి చెప్పడానికి సిద్ధమైన విషయాన్ని టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, ఎంఐఎం పార్టీ గుర్తించుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.‘ఇవాళ భైంసాలో జరిగిన ఈ ఘటన.. రేపు దేశవ్యాప్తంగా ప్రజ్వరిల్లే అవకాశం ఉంది. దేశంలోని హిందువులంతా ఆగ్రహిస్తే ఏం జరుగుతుందో ఒక్కసారి ఊహించండి.భైంసాకార్యకర్తలకు కూడా చెప్తున్నాం.. మీరు భయపడాల్సిన పని లేదు, తెగించి కొట్లాడండి. ఎంఐఎం గూండాల దాడులను ప్రతిఘటించండి’ అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.మేం సంయమనంతో ఉన్నాం. ప్రశాంతమైన వాతావరణం కల్పించాలని మేమున్నాం.. ప్రజాస్వామ్యబద్ధంగా మేమున్నాం. మా సహనాన్ని పిరికితనంగా భావిస్తున్నారు. దయచేసి చెప్తున్నాం.. పోలీసులు, ప్రభుత్వం స్పందించాలి. హిందువాహిని కార్యకర్తల మీద దాడి చేసినవారిపై చర్యలు తీసుకోవాలి’ అని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

Related Posts