YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

 తగ్గని కోడిపందాల జోరు

 తగ్గని కోడిపందాల జోరు

 తగ్గని కోడిపందాల జోరు
ఏలూరు జనవరి 14 
పశ్చిమగోదావరి జిల్లాలో సంక్రాంతి వచ్చేసింది..అది కూడా కోడి పందాలతో సంబరాలు అంబరాన్ని తాకనున్నాయి.సంక్రాంతి అనగానే ఉభయ గోదావరి జిల్లాలో ముందుగా గుర్తుచ్చేది కోడిపందాలే. ఈ కోడిపందాలను చూసేందుకు ఎక్కడి నుంచి వందలాది మంది తరలివస్తుంటారు. ప్రతి సంక్రాంతికి సాంప్రదాయంగా నిర్వహిస్తున్న కోడి పందాలను ఎంతో అట్టహాసంగా జరుపుకునేందుకు సన్నాహాలు మొదలయ్యాయి.మరోవైపు పోలీసులు సైతం ఈ కోడి పందాలను అడ్డుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తూనే ఉన్నారు.అయితే ఎట్టి పరిస్ధితిలోనూ తమ సాంప్రదాయాలను కొనసాగిస్తామని నిర్వాహకులు పోలీసులకు ఎదురు తిరుగుతున్నాయి.అయితే మరి ఈ సారి మూడు రోజుల పాటు ఎవరు గెలుస్తారన్నది మరి కొద్ది గంటల్లో తెలనుంది.
ఈ కోడి పందాలు జోరు ఎంతమాత్రం వెనక్కితగ్గేలా కనిపించడం లేదు.ఉభయ గోదావరి జిల్లాలో పందాల్లో సత్తా చాటేందుకు కోళ్లన్నీ బరి గీసుకొని మరీ కయ్యానికి కాళ్లు దువ్వుతున్నాయి.పందెం రాయుళ్లు కూడా తమ పౌరుషాన్ని చూపించేందుకు పందాలకు సిద్దం చేసిన కోళ్లను బరిలోకి దింపుతున్నారు.ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో కోడిపందాలే స్పెషల్ ఎట్రాక్షన్ అంతా ఈ కోడి పందాలనే చెప్పాలి.భారీగా కోడి పందాలు నిర్వహించడంతో ప్రతి ఏటా కోట్లాది రూపాయలు చేతులు మారిపోతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఈ భీమవరంలో జరిగే కోడిపందాలపైనే అందరి దృష్టి ఉంటుంది. ప్రత్యేకించి రాజకీయ, పారిశ్రామిక రంగాలవారితో పాటు ఎందరో సినీ ప్రముఖులు సైతం ఇక్కడికే వస్తుంటారు. ఎక్కడెక్కడో ఉండే పొరుగువారంతా సంక్రాంతికి తప్పకుండా భీమవరం రావాల్సిందే.. కోడి పందాలు చూడాల్సిందే అన్నట్టుగా ఉంటుంది.గోదావరి జిల్లాలో సంక్రాంతి సందడి అంతాఇంతా కాదు.. ఎక్కడికి వెళ్లినా ఒకవైపు సంక్రాంతి సంబరాలు.. మరోవైపు కోడి పందాలతో కన్నుల పండువగా కనిపిస్తుంది. ఎక్కడా చూసిన పొలాల్లో టెంట్లు, షామియనాలు, పందెం రాయుళ్ల చంకల్లో కోడి పుంజులు, ఫ్లడ్ లైట్ కాంతుల్లో కత్తులు దూసే పందెం కోళ్లతో కనిపిస్తుంటారు. పేకాట రాయుళ్లు, గుండాట, కోడి పకోడి, కోడి పలావ్ లతో విందు కార్యక్రమాలు, మద్యం.. అబ్బో సంక్రాంతికి నిండుదనం వచ్చేలా ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఒక్కసారి ఈ గోదావరి జిల్లాలకు సంక్రాంతి సమయంలో వచ్చినవారు మళ్లీ మళ్లీ రాకుండా ఉండలేరంటే అతిశయోక్తి కాదు.. మూడు రోజుల పాటు కొనసాగే ఈ సంక్రాంతి వేడుకల్లో కోడి పందాల కోసం పుంజులను సెలెక్ట్ చేస్తారు.ఇలా ఎంచుకున్న కోడిని బరిలోకి దింపి ప్రత్యర్ధి కోడిపై కలబడుతుంది.ఎవరి కోడి గెలిస్తే వాళ్లుకు ఈ ఏడాది అంతా పండుగే అన్న రీతిగా తెగ సంబరపడుతుంటారు.అంత క్రేజీ ఉంది ఈ కోడి పందాలకు.మరి మీరు చూసేందుకు వచ్చేయండి మరీ ....

Related Posts