YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

జగన్ కేసీఆర్ భేటీ... మారుతున్న వైఖరులు

జగన్ కేసీఆర్ భేటీ... మారుతున్న వైఖరులు

జగన్ కేసీఆర్ భేటీ... మారుతున్న వైఖరులు
ఏపీ విషయంలో మారిన తెలంగాణ సర్కారు వైఖరి
హైద్రాబాద్, జనవరి 14,
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని తెలంగాణ సర్కారు సుప్రీం కోర్టుకు స్పష్టం చేసింది. మణుగూరు ప్లాంటుతోపాటు, గిరిజనులకు ముంపు నష్టం లేకుండా చూడాలని కోరింది. ఏపీలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో పోలవరం ప్రాజెక్టు విషయమై తెలంగాణ సర్కారు సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. జగన్ సీఎం అయ్యాక పోలవరం విషయంలో కేసీఆర్ మెత్తబడ్డారు. పోలవరం ప్రాజెక్టుపై తమకు అభ్యంతరాలు లేవని ఆయన చెప్పారు. కానీ ఆ తర్వాత కూడా కేసీఆర్ భిన్నంగా మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించే విషయమై కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడారు. ప్రాజెక్టు ఎత్తు తగ్గించడానికి జగన్ అంగీకరించారని బడ్జెట్ సమావేశాల సందర్భంగా కేసీఆర్ చెప్పారు. ప్రాజెక్టు ఎత్తు తగ్గించడం వల్ల సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని తాను జగన్‌కు సూచించానని, దానికి ఆయన అంగీకరించారన్నారు.అంతకు ముందు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై తెలంగాణ ప్రభుత్వం తరఫున జీఏడీ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశారు. 2005 నాటికి పర్యావరణ అనుమతి 30 లక్షల క్యూసెక్కుల అంచనా మేరకేనని, డిజైన్ల మార్పుతో 50 లక్షల క్యూసెక్కులకు మారిందని తెలంగాణ సర్కారు అభ్యంతరం తెలిపింది. మారిన అంచనాల మేరకు మరోసారి పర్యావరణ అనుమతులు తీసుకోవాలని, పట్టిసీమ ద్వారా గోదావరి నీటిని ఏపీ ఇప్పటికే వాడుకుంటోందని అఫిడవిట్లో పేర్కొంది. పట్టిసీమలో తెలంగాణ వాటాను ప్రత్యేకంగా కేటాయించాల్సి ఉందని వాదించింది. కాళేశ్వరం, పాలమూరు - రంగారెడ్డిని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని కోరింది.పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తరలించడంపైనా తెలంగాణ సర్కారు అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. బచావత్ ట్రిబ్యునట్ ఆదేశాల ప్రకారం ఈ జలాల్లో తమకు కూడా వాటా ఉంటుందని వాదిస్తోంది. కాగా తెలంగాణలో ముంపు మండలాలను ఏపీలో విలీనం చేయడంతో పోలవరం ప్రాజెక్టుపై అభ్యంతరాలు వ్యక్తం చేసే హక్కు తెలంగాణకు లేదని ఏపీ సర్కారు పేర్కొంది. అంతే కాకుండా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఏపీ రైతాంగం ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుందని.. ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వొద్దని సుప్రీం కోర్టును కోరింది. జగన్ అధికారంలోకి వచ్చాక గత నవంబర్లోనే ఏపీ సర్కారు సుప్రీంలో అఫిడవిట్ దాఖలు చేయడం ఆశ్చర్యానికి గురి చేసింది.జనవరి 13న తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆరు గంటల పాటు భేటీ అయ్యారు. వీరిద్దరి సుదీర్ఘ చర్చల సందర్భంగా కృష్ణా గోదావరి నదుల అనుసంధానంపై ఏకాభిప్రాయానికి వచ్చారు. ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరించాలని నిర్ణయించారు. ఆ మరుసటి రోజే పోలవరం ప్రాజెక్టు విషయంలో తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని తెలంగాణ సర్కారు సుప్రీం కోర్టుకు స్ఫష్టం చేయడం గమనార్హం.

Related Posts