YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

బాల్ ట్యాంపరింగ్ తో ఆసీస్ కు తిప్పలు 

Highlights

  • బాల్ ట్యాంపరింగ్ ని తప్పుబట్టిన స్పాన్సర్లు
  • ఒప్పందాల పునఃసమీక్ష నిర్ణయం
బాల్ ట్యాంపరింగ్ తో ఆసీస్ కు తిప్పలు 

బాల్ ట్యాంపరింగ్‌ వివాదంతో ఆసీస్ కు తిప్పలు వచ్చిపడేలా ఉన్నాయి.వివాదంపై స్పాన్సరింగ్ కంపెనీలు తీవ్రంగా స్పందించాయి. దేశపరువు ప్రతిష్ఠలను దిగజార్చిన  కెప్టెన్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ తీరుతో తమ బ్రాండ్ వ్యాల్యూ దారుణంగా దెబ్బతిందని, భవిష్యత్తులో తమ బ్రాండ్లకు మరింత నష్టం వాటిల్లే అవకాశం ఉందని స్పాన్సరింగ్ కంపెనీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.దీంతో ఆటగాళ్లు, జట్టు, బోర్డుతో కుదుర్చుకున్న ఒప్పందాలను పునఃసమీక్షించుకోవాలని స్పాన్సరింగ్ కంపెనీలు నిర్ణయించాయి. ఈ వివాదంపై సీఏతో చర్చలు జరుపుతున్నట్టు వెల్లడించింది. ఆసీస్ జట్టు అతిపెద్ద స్పాన్సర్ అయిన మాగెల్లాన్ సంస్థ తాజా వివాదంపై విస్మయం వ్యక్తం చేసింది. బాల్ ట్యాంపరింగ్‌ తమను తీవ్ర ఆందోళనకు గురిచేసిందని, జట్టు చేసిన పని క్షమించరానిదని స్పష్టం చేసింది. దీనిపై సీఏ స్పందన గురించి వేచి చూస్తున్నామని తెలిపింది. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న క్రికెటర్ల తీరు తమను తీవ్ర ఆవేదనకు గురిచేసిందని, ఆటగాళ్లు ఇంత నీచమైన పని చేస్తారని ఊహించలేకపోయామని ఆసీస్ జట్టు అధికారిక స్పాన్సర్ క్వాంటమ్ ఎయిర్‌ లైన్స్ తెలిపింది. మరోవైపు స్మిత్ సేన చేసిన పనితో ఆసీస్ జాతీయ మహిళా జట్టును స్పాన్సర్ చేస్తున్న కామన్వెల్త్ బ్యాంకు సీఏను వివరణ కోరిందని తెలుస్తోంది. లుక్రాటివ్ టీవీతో కుదిర్చుకున్న 600 మిలియన్ డాలర్ల ఐదేళ్ల ఒప్పందం ఈ ఏడాది చివరకు ముగియనుంది. వివాదాన్ని బూచిగా చూపి బేరసారాలకు దిగనున్నట్టు తెలుస్తోంది. 

 

Related Posts