YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

 మున్సి`పల్స్ ` పట్టుకుంటే... కేటీఆర్ కు పట్టాభిషేకం

 మున్సి`పల్స్ ` పట్టుకుంటే... కేటీఆర్ కు పట్టాభిషేకం

 మున్సి`పల్స్ ` పట్టుకుంటే... కేటీఆర్ కు పట్టాభిషేకం

మున్సిపోల్స్‌ ఎన్నికలు  అదిరిపోయే ఫలితాలు వస్తే... ఇక తారక రాముడి పట్టాభిషేకమేనని ప్రచారం జోరుగా సాగుతోంది.  అందుకే మున్సిపల్ ఎన్నికల మేనల్లుడు గులాబీ ట్రబుల్ షూటర్ హరీష్ రావును పక్కన పెట్టేశారన్న ప్రచారం సాగుతోంది.   ఇక కేటీఆర్ కూడా బరిలో, రంజు మీదున్న పుంజులా కేటీఆర్‌ కనిపిస్తున్నారని ఎమ్మెల్యేలంటున్నారు.తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు ఏ రకంగా చూసినా, ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆయన కుమారుడు, మంత్రి కేటీఆర్‌కు అత్యంత ప్రతిష్టాత్మకం. ఎందుకంటే, ఈ ఎన్నికల తర్వాత, తెలంగాణలో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయన్న చర్చ జరుగుతోంది. మొత్తం 120 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లకు ఎన్నికలకు జరగబోతున్నాయి. జనవరి 22న ఎన్నికలు, 25న ఫలితాలు. ఈ ఎలక్షన్స్‌ బాధ్యతలు కేటీఆర్‌కు అప్పగించారు సీఎం కేసీఆర్. ఈ బాధ్యతలు అప్పగించడం వెనక గులాబీ రథసారథికి పక్కా వ్యూహముందన్న చర్చ జరుగుతోంది. పురపోరులో అఖండ ఫలితాలు సాధిస్తే, కేటీఆర్‌ ప్రతిష్ట మరింత పెరుగుతుంది. పట్టణాలు, నగరాల్లోని పార్టీలో కేటీఆర్‌ పట్టు మరింతగా దొరుకుతుంది. 2019లో జరిగిన స్థానిక ఎన్నికల్లోనూ విజయం సాధించడంతో, ఇప్పటికే కేటీఆర్‌కు, గ్రామస్థాయిలో కార్యకర్తలు హారతి పట్టారు. తాజాగా మున్సిపల్‌ ఎన్నికల్లోనూ కేటీఆర్‌ మార్క్‌ చూపిస్తే, ఇక గ్రామాలు, పట్టణాలు, నగరాలు అన్న తేడాలేకుండా, కేటీఆర్‌కు పట్టు లభిస్తుందని కేసీఆర్ భావిస్తున్నారు.తెలంగాణ మున్సిపల్ బరిలో 12956 మంది పోటీ ఇఫ్పటికే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు కీలక బాధ్యతలు అప్పగించారు కేసీఆర్. ఏమాత్రం తేడాలొచ్చినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఫలితాలు బ్రహ్మాండంగా వస్తే, ఆ క్రెడిట్‌ మొత్తం కేటీఆర్‌కే దక్కుతుంది. దీంతో తారక రాముడి పట్టాభిషేకానికి ఇంతకుమించిన సందర్భం మరోటి వుండదని గులాబీ బాస్ లెక్క. విపక్షాలు ఇప్పటికీ కోలుకోకపోవడంతో, మున్సిపల్‌ ఫలితాలు టీఆర్ఎస్‌కు ఏకపక్షమవుతాయని ఆయన ఆలోచిస్తున్నారు. అందుకే మున్సిపల్ ఎన్నికలు కేటీఆర్‌ రాజకీయ జీవితంలో మేలి మలుపుకానున్నాయన్న చర్చ జరుగుతోంది. తనపై అంచనాలు పెరుగుతున్న నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మంగా తీసుకున్నారు కేటీఆర్. స్థానిక నేతలతో విస్తృతంగా సమావేశమవుతున్నారు

Related Posts