ఘనంగా జల్లికట్టు
చెన్నై జనవరి 16,
తమిళనాడు రాష్ట్రంలో జల్లికట్టు పోటీలు ఘనంగా కొనసాగాయి. సంక్రాంతిని సందర్భంగా తమిళనాడులో ప్రతి యేటా జల్లికట్టు పోటీలను నిర్వహిస్తుం టారు.అవనియాపురంలో 730, అలంగనళ్లూర్లో 700 ఎద్దులతో పోటీలు ప్రారంభమయ్యాయి. పలమేడులో 650 ఎద్దులతో జల్లికట్టు పోటీలను ప్రారంభించా రు. గాయపడినవారికి చికిత్స కోసం అందుబాటులో అంబులెన్స్ లను ఏర్పాటు చేశారు. జల్లికట్టు పోటీలు చాలా భయంకరంగా సాగుతున్న నేపథ్యంలో.. ఒక్కసారిగా వదిలిన బలమైన ఎడ్లను.. పోటీలో పాల్గొనే వారు వాటి కొమ్ములను పట్టుకొని లొంగదీసుకోవాలి. ఈ సమయంలో చాలా మంది గాయాలపాల వుతారు. కొన్ని సందర్భాల్లో చనిపోయిన ఘటనలూ ఉన్నాయి. ఈ ప్రమాదకర ఆటలకు స్వస్తి చెప్పాలని సుప్రీం కోర్టు ఆదేశించి నా.. జల్లికట్టు తమ సంస్కృతిలో భాగమని తమిళులంతా ఏకమై.. తీవ్ర ఆందోళనలు చేశారు. ప్రజలకు సినీ తారలు, రాజకీయనాయకులు సైతం మద్దతు తెలిపారు.దింతో ఉత్కంఠ పోరులో జల్లికట్టు క్రీడా కొనసాగుతోంది.