Highlights
బీజేపీ ఎంపీలంతా ఇష్టాగోష్ఠి చర్చలో నిర్ణయం
తెలుగుదేశం.వైసీపీతో పాటు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ కూడా అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇవ్వడంతో ప్రభుత్వం ఇక వెనుకాడకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. మంగళవారం నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో రాజకీయ పరిణామాలు వేగవంతం కానున్నాయి.అవిశ్వాస తీర్మానానికి ప్రభుత్వం భయపడుతుందనే సంకేతాలు రావడంతో తాడోపేడో తేల్చుకోవాలని బీజేపీ నిర్ణయించింది. మంగళవారం బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో బీజేపీ ఎంపీలంతా ఇష్టాగోష్ఠి చర్చలో పార్లమెంట్ లో..అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగకుండా తామే అన్నాడీఎంకే, టీఆర్ ఎస్‌లను పురికొల్పుతున్నామనే విమర్శలు రావడం కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం.అయితే..మనకు పూర్తి మెజారిటీ ఉంది..విశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొనేందుకు..మనమెందుకు భయపడాలి ?,అని..ఎంపీలు అభిప్రాయపడ్డట్లు తెలుస్తోంది. కాగా..పార్లమెంట్ ఉభయ సభలు సజావుగా సాగకుండా ప్రతిపక్షాలు అడ్డుకోవడంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా విరుచుకుపడ్డారు.బీజేపీపై రోజురోజుకు ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని ఆరోపించారు.అందుకే ఒక్క నిమిషం కూడా సభ జరగకుండా విపక్షాలు సభను అడ్డుకుంటున్నాయన్నారు.