వేడుకగా శ్రీకాళహస్తీశ్వరుని కైలాసగిరి ప్రదక్షిణ.
శ్రీకాళహస్తి జనవరి 16,
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే కైలాసగిరి ప్రదక్షిణోత్సవాన్ని కనుమ పండుగ సందర్భంగా ఆలయ అధికార్లు ఘనంగా నిర్వహించారు. మాఘ మాసంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా జరిగే కల్యాణోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీజ్ఞానప్రసూనాంబిక సమేత సోమస్కంధమూర్తి ఉత్సవమూర్తులు కైలాసగిరి ప్రదక్షిణను చేశారు. కైలాసగిరి పర్వతశ్రేణుల్లో ఉన్న దేవతలు, రుషులను కల్యాణానికి ఆహ్వానిస్తూ ఈ విశేషోత్సవం జరిపారు. భగవంతుడిని అనుసరిస్తూ అధిక సంఖ్యలో భక్తులు గిరి ప్రదక్షిణోత్సవంలో పాల్గొన్నారు. ముక్కంటి ఆలయం నుంచి ప్రారంభమైన ఈ గిరి ప్రదక్షిణోత్సవం 21 కిలోమీటర్ల పొడవునా సాగింది.