YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

మంత్రికి తలనొప్పిగా మారిన ఆడియో టేప్స్

మంత్రికి తలనొప్పిగా మారిన ఆడియో టేప్స్

మంత్రికి తలనొప్పిగా మారిన ఆడియో టేప్స్
హైద్రాబాద్, జనవరి 16
మేడ్చల్ పురపాలిక పరిధిలో టీఆర్ఎస్ టికెట్ల కేటాయింపు గోల మరింత రసవత్తరంగా మారింది. నేతల మధ్య విభేదాలు బయటపడి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. మంత్రి మల్లారెడ్డి, టీఆర్ఎస్ నేత రాపోలు రాములకు మధ్య జరిగిన ఫోన్ సంభాషణ తాజాగా బయటకు పొక్కడంతో ఈ టేప్ సంచలనం రేపుతోంది. తన తరపు వారికి టికెట్లు ఇవ్వకపోవడంపై రాపోలు రాములు మంత్రిని ఫోన్‌లో నిలదీశారు. ‘‘నీపై నమ్మకం పోయింది. నా వారిలో ఎవరికి టికెట్ ఇప్పించావు చెప్పు..’’ అని రాపోలు నిలదీయగా, తొందర పడొద్దని మంత్రి మల్లారెడ్డి నచ్చజెప్పారు. అయినా, రాపోలు వినలేదు.మల్లారెడ్డి వ్యవహారమంతా పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెప్తానని, త్వరలో ఆయన్ను కలుస్తానని ఫోన్‌లో రాపోలు తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు కూడా నీ గురించి చెప్తానని బెదిరించగా, చెప్పుకోమని మల్లారెడ్డి సమాధానమిచ్చారు. టికెట్ కోసం తన వద్ద డబ్బు డిమాండ్ చేసిన తాలూకు రికార్డులు ఉన్నాయని, వాటిని అధిష్ఠానానికి చెప్తానని బెదిరించారు. తనపై పోలీసు నిఘా పెట్టినా ప్రజల కోసం తాను జైలుకు వెళ్లేందుకు సైతం సిద్ధమేనని వెల్లడించారు.తన మనిషి రమేష్‌కు టికెట్ ఎందుకు ఇవ్వలేదని రాపోలు రాములు మల్లారెడ్డిని నిలదీశారు. ఆయన ఒక్కసారి కూడా తన వద్దకు రాలేదని మల్లారెడ్డి జవాబిచ్చారు. ప్రజల మధ్య ఉండాలా, నీ చుట్టూ తిరగాలా అని రాములు ప్రశ్నించారు. మల్లారెడ్డికి సంబంధించిన వీడియోలు తన వద్ద ఉన్నాయని, పోలీసులకు పట్టిస్తానని రాపోలు రాములు హెచ్చరించారు.

Related Posts