YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జూనీయర్ ఎన్టీఆర్.. 2024 సీఎం

జూనీయర్ ఎన్టీఆర్.. 2024 సీఎం

జూనీయర్ ఎన్టీఆర్.. 2024 సీఎం
ఒంగోలు, జనవరి 16
రాబోయే కాలానికి కాబోయే సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటున్నారు తెలుగు తమ్ముళ్లు. 2024నాటికి తారక్ ముఖ్యమంత్రి కావడం పక్కా అంటున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో తమ మనసులో మాట చెప్పేశారు. ఈ ఫ్లెక్సీ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా, వాట్సాప్స్‌లో వైరల్ అవుతోంది.. టీడీపీలోనూ హాట్‌టాపిక్ అయ్యింది.సంక్రాంతిసందర్భంగా ప్రకాశం జిల్లా యర్రగొండ పాలెలంలో తెలుగుదేశం పార్టీ నేతలు ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. నియోజకవర్గ ఇంఛార్జ్ బూదాల అజితారావుకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. అందులో తమ పార్టీ నేతల ఫోటోలను ముద్రించారు.. జూనియర్ ఎన్టీఆర్ ఫోటోకు ప్రాధాన్యం ఇచ్చారు. రాబోయే కాలానికి కాబోయే సీఎం.. 2024 ముఖ్యమంత్రి అంటూ క్యాప్షన్ పెట్టారు.అజితారావు యర్రగొండపాలెం టీడీపీ ఇంఛార్జ్‌గా ఉన్నారు. 2014,2019 ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. అంతేకాదు ఆమె మాజీ మంత్రి శిద్దా రాఘవరావు, సీనియర్ నేత కరణం బలరాంకు అనుచరురాలిగా ఉన్నారు. ఆమె అభిమానులు, కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీ ఆసక్తికరంగా మారింది. అంతేకాదు ఈ ఫ్లెక్సీల్లో ఎక్కడా చంద్రబాబు ఫోటో లేకపోవడం విశేషం. మొత్తం మీద జూనియర్ ఎన్టీఆర్ ఫోటోతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ చర్చనీయాంశంగా ఉంది.

Related Posts