YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

 రెండు సినిమాలు బ్లాక్ బస్టర్స్

 రెండు సినిమాలు బ్లాక్ బస్టర్స్

 రెండు సినిమాలు బ్లాక్ బస్టర్స్
హైద్రాబాద్, జనవరి 16
తెలుగు సినిమా చరిత్రలో బాక్సాఫీసు కలెక్షన్ల మీద ఇంత గందరగోళ పరిస్థితి ఎప్పుడూ రాలేదేమో..! ఒకేసారి విడుదలైన రెండు బడా సినిమాలు పోటాపోటీగా బాక్సాఫీసు కలెక్షన్లను ప్రకటిస్తుండటం ఇదే మొదటిసారేమో..! చరిత్ర ఎలా ఉన్నా ప్రస్తుతం ‘సరిలేరు నీకెవ్వరు’, ‘అల వైకుంఠపురములో’ చిత్ర యూనిట్లు చేస్తోన్న ప్రచారం విమర్శలకు తావిస్తోంది. వాళ్లు వెల్లడించే కలెక్షన్ల లెక్కలన్నీ ఫేక్ అని ప్రేక్షకులు సైతం కొట్టేసే పరిస్థితి వచ్చింది.సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చిత్రం ‘అల వైకుంఠపురములో’ మధ్య పోటీ కచ్చితంగా ఉంటుందని అంతా ఊహించారు. ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో బాగా కొట్టుకున్నారు. మొత్తానికి జనవరి 11న ‘సరిలేరు’, 12న ‘అల’ విడుదలయ్యాయి. రెండు సినిమాలూ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి. దీంతో సోషల్ మీడియాలో అభిమానుల మధ్య మాటల యుద్ధం మరింత పెరిగింది. దీనికి కారణం కలెక్షన్లు.ఈ రెండు సినిమాల నిర్మాణ సంస్థలు తొలిరోజు నుంచే విపరీతమైన ప్రచారం మొదలుపెట్టాయి. ‘సరిలేరు నీకెవ్వరు’‌ను బ్లాక్ బస్టర్‌ కా బాప్ అని వర్ణించారు. అంతేకాకుండా తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.46.77 కోట్ల షేర్ వసూలు చేసిందని అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేశారు. అంతే, ఆ తరవాత రోజు నుంచి ‘అల వైకుంఠపురములో’ రగడ మొదలైంది. ఈ సినిమా తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.85 కోట్లు గ్రాస్ వసూలుచేసిందని పోస్టర్ వదిలారు. ఇక అక్కడి నుంచి కలెక్షన్లు ఫేక్ అనే వాదన మొదలైంది. అయినప్పటికీ ఈ ఇద్దరు హీరోలూ ఎక్కడా తగ్గలేదు.మా సినిమా ‘నాన్-బాహుబలి 2’ రికార్డులను బద్దలుకొట్టేసిందని ‘సరిలేరు నీకెవ్వరు’, ‘అల వైకుంఠపురములో’ చిత్ర నిర్మాణ సంస్థలు ఎవరికివారు చెప్పుకుంటున్నారు. రెండు సినిమాలకూ ఒకేసారి ‘నాన్-బాహుబలి’ రికార్డులు ఎలా వస్తాయో అర్థం కావడంలేదు. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ఐదు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ.68 కోట్ల షేర్ వసూలు చేసిందని అంటున్నారు. ఇక ‘అల వైకుంఠపురములో’ అయితే మూడు రోజుల్లోనే తెలుగు రాష్ట్రాల్లో రూ.59 కోట్లు రాబట్టిందని చెబుతున్నారు. ఈ కలెక్షన్లు చూస్తే అర్థమవుతోంది ఈ రెండు సినిమాలు ఎంత పోటీపోటీగా కలెక్షన్లను ప్రకటిస్తున్నాయో..!అల వైకుంఠపురములో’ కలెక్షన్లు ఫేక్ అంటూ కొన్ని వెబ్‌సైట్లు పేర్కొన్నాయి. యూఎస్‌లో బాక్సాఫీసు రికార్డులను ఈ సినిమా తిరగరాస్తోందని చిత్ర యూనిట్‌తోపాటు సినీ విశ్లేషకులు, ట్రేడ్ అనలిస్ట్‌లు చెబుతున్నారు. అయితే, ఈ లెక్కలన్నీ ఫేక్ అని కొన్ని వెబ్‌సైట్లు వార్తలు రాశాయి. న్యూ జెర్సీలోని ఒక దేశీ థియేటర్‌ ద్వారా ఈ ఫేక్ కలెక్షన్స్ బాగోతం బయటపడిందట. అక్కడి ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ ఒకరు ఈ కలెక్షన్లన్నీ ఒక స్కామ్ అని పేర్కొన్నారట. మేకర్స్ నుంచి ఒత్తిడి రావడం వల్లే తాము ఈ తప్పుడు లెక్కడు చూపిస్తున్నామని థియేటర్ యాజమాన్యం అంగీకరించినట్టు ‘తెలుగు రిపోర్టర్’ అనే వెబ్‌సైట్ పేర్కొంది. ఈ వార్తలో నిజమెంతో తెలీదు కానీ.. ‘ఫేక్’ అనే మాటకు ఎక్కువ మద్దతు లభిస్తోంది.

Related Posts