YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

సిరిసిల్లకు రైలు, జేఎన్టీయూ

సిరిసిల్లకు రైలు, జేఎన్టీయూ

సిరిసిల్లకు రైలు, జేఎన్టీయూ
కరీంనగర్, జనవరి 16
సిరిసిల్లను దేశంలో అత్యున్నత మున్సిపాలిటీగా తీర్చిదిద్దే బాధ్యత తనదని పురపాలక మంత్రి కేటీఆర్‌ అన్నారు. సిరిసిల్లను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దామని చెప్పారు. ఇప్పటికే ఎన్నో జాతీయ అవార్డులు వచ్చాయని ఆయన గుర్తు చేశారు. సిరిసిల్లలో ఓటు అడిగే హక్కు కేవలం టీఆర్‌ఎస్‌కు మాత్రమే ఉందన్నారు. సిరిసిల్లకు త్వరలో రైలు మార్గం రావాలని.. రెండు, మూడేళ్లలో రైలు మార్గం రావడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బుధవారం సాయంత్రం ఆయన సిరిసిల్ల మున్సిపాలిటీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. .సిరిసిల్ల ప్రాంతాన్ని విద్యాకేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని కేటీఆర్ తెలిపారు. రానున్న రోజుల్లో జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్‌ కళాశాల కూడా వచ్చేలా కృషి చేస్తానన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేతన్నలకు జీవనాధారం కల్పించామని చెప్పారు. సిరిసిల్ల పట్టణంలో పది నుంచి పన్నెండు వేల మంది ఆడబిడ్డలకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇచ్చారు.చెప్పినవే కాకుండా.. చెప్పని పనులు కూడా ఎన్నో చేశామని కేటీఆర్‌ తెలిపారు. మభ్యపెట్టే వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. సిరిసిల్లలో 50 ఏళ్లలో జరగని అభివృద్ధిని ఐదేళ్లలో చేసి చూపించామని కేటీఆర్ చెప్పారు. కారు గుర్తుకు ఓటేస్తేనే తమను ఆశీర్వదించినట్లని చెప్పారు. పరకాల, చెన్నూరు పురపాకల సంఘాలను ఇప్పటికే ఏకగ్రీవంగా గెలుపొందామని ప్రకటించారు. ఏకగ్రీవంగా ఎన్నికైన నలుగురు కౌన్సిలర్లకు కేటీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల్లో విజయానికి నేతలంతా సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Related Posts