YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 నారా, నందమూరి ఫ్యామిలీ జోలికి రావద్దు

 నారా, నందమూరి ఫ్యామిలీ జోలికి రావద్దు

 నారా, నందమూరి ఫ్యామిలీ జోలికి రావద్దు
హైద్రాబాద్, జనవరి 16
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డిపై ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ మండిపడ్డారు. చంద్రబాబుపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని.. నారా, నందమూరి కుటంబాల జోలికి రావొద్దంటూ హెచ్చరించారు. మాట్లాడే ముందు కాస్త నోరు అదుపులో ఉంచుకోవాలన్నారు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశారు.ఏపీలో రాజకీయ పరిణామాలు చూస్తుంటే బాధగా ఉందన్నారు రామకృష్ణ. ఎవరో కాకినాడ ఎమ్మెల్యే.. ప్రజా ప్రతినిధిగా ఉండి.. హోదా మర్చిపోయి చంద్రబాబుపై నోరు జారారని.. ఆయన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అన్నారు. తాము గాజులు తొడుక్కో లేదని.. తమది సంస్కారం ఉన్న పార్టీ అన్నారు. తాము నోరు తెరిస్తే ఎమ్మెల్యే జాతకాలు బయటపెట్టగలమని.. కానీ బావుండదన్నారు.ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి వయసు ఎంత.. చంద్రబాబు వయసు ఎంత.. ఎమ్మెల్యేకు ఉన్న అనుభవం ఎంత.. బాబు అనుభవం ఎంత అంటూ మండిపడ్డారు. ఏదైనా ఉంటే రాజకీయం గురించి మాట్లాడుకోండి.. తమ కుటుంబాల జోలికి రావొద్దని హెచ్చరించారు. ఇలా రెచ్చగొట్టే ధోరణిలో వ్యాఖ్యలు చేయడం సరికాదని.. అది మీ చేతిలోనే ఉంది.. జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చారు.

Related Posts