ఉరిశిక్ష అమలు జాప్యం కు ఢిల్లీ ప్రభుత్వం కారణం: జవదేకర్
న్యూఢిల్లీ జనవరి 16
2012 నిర్బయ కేసులో నలుగురు నిందితుల ఉరిశిక్ష అమలులో జాప్యం కావడానికి కారణం ఢిల్లీ ప్రభుత్వం నిర్లక్ష్యమేనని కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ ఆరోపించారు. నిర్బయ కేసుకు న్యాయం జరుగడంలో అవుతున్న ఆలస్యానికి ఆప్ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని చురకలంటించారు. ఢిల్లీ ప్రభుత్వం గత రెండున్నరేళ్లలో నిర్బయ కేసు నిందితులకు క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేసుకునేందుకు ఎందుకు నోటీసులు జారీచేయలేదని ప్రకాశ్ జవదేకర్ ప్రశ్నించారు.ఈ కేసులో దోషుగా ఉన్న నలుగురు వ్యక్తులు ముఖేశ్(32), పవన్ గుప్తా(25), వినయ్ శర్మ(26), అక్షయ్ కుమార్ సింగ్ (అక్షయ్ ఠాకూర్)(31)పై ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు అదనపు సెషన్స్ జడ్జి సతీశ్ కుమార్ అరోరా ఇప్పటికే డెత్ వారెంట్ జారీ చేసిన విషయం విదితమే. ఈ 14 రోజుల్లో దోషులు తమ న్యాయపరమైన అవకాశాలు వినియోగించుకోవచ్చని ఈ సందర్భంగా ఢిల్లీ పాటియాలా కోర్టు సూచించింది.