హెచ్చరించినా ఆగని జల్లికట్టు
కుప్పం జనవరి 16
చిత్తూరు జిల్లా కుప్పంలో పోలీసు హెచ్చరికలను స్థానిక నేతలు బేఖాతర్ చేసి జల్లికట్టు నిర్వహించారు. వివరాలకు వెళ్తే రామకుప్పం మండలం చిన్న బల్దార్ గ్రామములో నాలుగు రోజుల క్రితం జల్లి కట్టులో ఒక్కరు మృతి చెందారు. అంతలోనే మళ్ళీ జల్లికట్టు మొదలయింది. ఒక్కపక్క ఎస్పీ, డిఎస్పీ, కలెక్టర్ జల్లికట్టు నిర్వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకొండి అని లోకల్ పోలీసులకు హెచ్చరించినా, లోకల్ పోలీసులు మాత్రం చూసిచూడనట్లు వ్యవరిస్తున్నారు. ఒకరు మృతి చెందినా లెక్కచేయకుండా మల్లీ జల్లికట్టు నిర్వహించారు. పోలీసులు మాత్రం జల్లికట్టు నిర్వహించిన వారిపై కఠినచర్యలు తీసుకొంటామని ప్రచారం చేస్తున్నారు. డీఎస్పీ మాట్లాడుతూ జల్లికట్టు నిర్వహిస్తే నాన్ బెయిలబుల్ కేసు పెడతామని చెబుతున్నారు. అయితే లో కల్ నాయకుల అండతో నిర్వహకులు జల్లికట్టు నిర్వహిస్తున్నారు