YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

బీచ్ రోడ్డులో 16 రకాల టీలు

బీచ్ రోడ్డులో 16 రకాల టీలు

బీచ్ రోడ్డులో 16 రకాల టీలు
విశాఖపట్టణం జనవరి 17,
రాజైనా, బంటైనా, ధనికుడైనా, పేదోడైనా, యువకుడైనా, వృద్ధుడైనా ఉదయాన్నే నిద్ర లేవగానే వేడివేడి చారు గొంతులో పడాల్సిందే. మన దేశంలో చాలా మందికి ఉదయం నిద్ర లేవగానే టీ తాగడం నిత్యకత్యంగా మారింది. చలికాలంలో వేడివేడి తేనీరు సేవిస్తే ఆ మజానే వేరు. కొందరు రోజుకు నాలుగైదు సార్లు తేనీరు సేవిస్తుంటారు. విశాఖ సిటీలో ప్రస్తుతం ఎక్కడ చూసినా నూతన రకాల టీ దుకాణాలు వెలుస్తున్నాయి. ముఖ్యంగా బీచ్‌ రోడ్డులో ఈ దుకాణాల సంఖ్య వేలల్లో ఉంటుందంటే అతిశయోక్తి కాదు. తెల్లవారుజామున వాకింగ్‌, రన్నింగ్‌లకు వెళ్లే వారితో ఈ దుకాణాలు నిత్యం కలకళలాడుతుంటాయి. ఇవి కాకుండా నగరం మధ్యలో కూడా వేలాది దుకాణాలు వెలిశాయి. ఆర్థిక రాజధానిగా గుర్తింపు పొందుతున్న విశాఖలో టీ వ్యాపారం జోరందుకుంటోంది. టీ స్టాల్స్‌లో కొత్త రుచులను అందిస్తున్నారు. ఇప్పటి వరకూ బాయిలర్‌ టీ, డికాక్షన్‌ టీ, స్పెషల్‌ టీలకే వ్యాపారం పరిమితమైంది. ఈ మధ్య కాలంలో గ్రీన్‌ టీ, లెమన్‌ టీ, పెప్పర్‌ టీ, రోజ్‌ టీ, ఇరానీ టీ, శాంతి టీ, అల్లం టీ, బాదం టీ, హెర్బల్‌ టీ, హనీ టీ, వైట్‌ టీ, షుగర్లెస్‌ టీ ఇలా పదుల సంఖ్యలో తేనీటి వెరైటీలను వ్యాపారులు అందుబాటులోకి తెస్తున్నారు. వివిధ రకాల టీలను అందించేందుకు టీ లాంజ్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఛారుకు ప్రతి సీజన్లో గిరాకీనేకానీ చలికాలంలో అది రెట్టింపు అవుతుందని వ్యాపారులు చెబుతున్నారు. సిటీ పరిధిలో సుమారు పది వేలకుపైగా టీ షాపులున్నాయంటే ఆశ్చర్యపోవాల్సిందే.టీ స్టాల్స్‌కు వచ్చే చాలా మంది గ్రీన్‌, లెమన్‌ టీలను ఎక్కువగా సేవిస్తున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఆరోగ్యంపై శ్రద్ధ ఉన్నవారికి ఇది ప్రత్యేకం అనే అభిప్రాయం ఉంది. సన్నగా అవ్వాలనుకునేవారు, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు గ్రీన్‌ టీనే ప్రిపర్‌ చేస్తున్నారు. ప్రత్యేక లాంజ్లలో, మొబైల్‌ ప్యాంట్రీల్లో గ్రీన్‌ టీలో 16 రకాలు అందుబాటులో ఉన్నాయి. బ్లాక్‌ టీ, పుదీనా టీ, ప్లేవర్డ్‌ టీ, ఎల్లో టీ, వైట్‌ టీ, చాక్లైట్‌ టీ, స్పెషల్‌ టీ, ఐస్‌ టీ వంటి అనేక రకాలు లభిస్తున్నాయి. వీటి కోసం అస్సాం, నీలగిరీస్‌, డార్జిలింగ్‌ వంటి ప్రాంతాలతోపాటు డ్రాగన్‌ దేశాలైన చైనా, జపాన్‌ నుంచి కూడా తేయాకు తెప్పిస్తున్నారంటే వాటి ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చు. ఇందులో ఎటువంటి ఇతర పదార్థాలూ కలపకుండా రా టీని సైతం అందుబాటులోకి తెస్తున్నారు. లేలేత టీ ఆకులకు కాస్త వేడి నీటిని చేర్చి చేతికందించే లాంజ్లలో రకరకాల రుచులే కాదు, ధరలూ అదే స్థాయిలో ఉంటున్నాయి. మొత్తంగా విశాఖ నగరంలో టీ వ్యాపారం తోపాటు, తేయాకు విక్రయాలు రోజుకు రూ.కోటి మించి ఉంటుందని వ్యాపారస్తులు చెబుతున్నారు.ఐదు వేల సంవత్సరాల క్రితం చైనాలో పుట్టిన తేయాకు యూరప్‌, అమెరికాల మీదుగా ఈస్ట్‌ ఇండియా కంపెనీ ద్వారా ఇండియాలోకి అడుగుపెట్టిందని చరిత్ర ఆధారాలు చెబుతున్నాయి. మన దేశంలో పాపుగిరి, అస్సాం, మైసూర్‌, తమిళనాడు తదితర ప్రాంతాల్లో తేయాకు పంటలు కనిపిస్తాయి. అస్సాం ప్రపంచంలోనే అత్యధికంగా తేయాకు పండించే ప్రాంతం. ఇతర దేశాలకు టీ పొడి ఉత్పత్తుల ఎగుమతిలో చైనాది తొలి స్థానంకాగా మన దేశంలోని అస్సాం రెండో స్థానాన్ని ఆక్రమించింది. విశాఖకు కూడా అస్సాం నుంచే ముడి సరుకును దిగుమతి చేసుకుంటున్నారు. పరిమితికి మించి టీ తాగితే ఆరోగ్య సమస్యలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గ్రీన్‌ టీ, హెర్బల్‌ టీ శరీరంలో ఉష్ణోగ్రతలను అదుపులో ఉంచుతాయని, కొవ్వును కరిగిస్తాయని ప్రచారం ఉండటం వల్ల ఈ మధ్య కాలంలో వీటి సేవనం అధికమైందని సర్వేలు చెబుతున్నాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కాయగూరల్లోనూ దొరకవు. అయితే, ఇతర టీలతో పోల్చితే గ్రీన్‌ టీలో కెఫిన్‌ తక్కువగా ఉన్నా అది మోతాదు మించితే ప్రమాదం అంటున్నారు నిపుణులు. ఇతర టీల విషయానికి వస్తే శరీరంలోకి కెఫిన్‌ అధికంగా వెళితే బాడీలో చిరాకు పెరుగుతుంది. ఎముకల్లోని కాల్షియాన్ని మూత్రం ద్వారా బయటకు పంపిస్తుంది. వీటిలోని యాక్సలైట్‌ అనే యాసిడ్లు కాలేయంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. కంటిలోని గ్లకోమాపై ఒత్తిడి పెంచి నిద్రను దూరం చేస్తాయి. ప్రత్యేక టీలో రంగు కోసం కలిపే పొడుల్లో అధికంగా ఉండే టాసిస్‌ అనే రసాయనాలు శరీరంపై దురదను కలిగింపచేస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. గర్భిణులు తేనీరుకు వీలైనంత వరకు దూరంగా ఉండటమే మంచిదని వైద్య రంగం విశ్లేషణ. గ్రీన్‌ టీ విషయంలో తయారీ కంపెనీలు సూచిస్తున్న రికమండెడ్‌ డోస్‌ రోజుకు మూడు కప్పలు మాత్రమే. కానీ చాలా మంది ఎక్కువ సార్లు గ్రీన్‌ టీ తీసుకుంటున్నారు. దీని వల్ల శరీరానికి నష్టం జరిగే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Related Posts