YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

మున్సిపల్ ఎన్నికల్లో ఫేస్ రికగ్నైజేషన్

మున్సిపల్ ఎన్నికల్లో ఫేస్ రికగ్నైజేషన్

మున్సిపల్ ఎన్నికల్లో ఫేస్ రికగ్నైజేషన్
హైద్రాబాద్, జనవరి 17 br /> మున్సిపల్‌ ఎన్నికలను స్వేచ్ఛగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో దొంగ ఓట్లకు చెక్‌ పెట్టాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. పోలింగ్‌ కేంద్రాల్లో ఫేస్‌ రికగ్నెజ్‌ కెమెరాలు వినియోగించనున్నట్లు తెలిపింది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో సాధ్యాసాధ్యాలపై అధికారులతో ఎన్నికల సంఘం చర్చలు నిర్వహించింది. మున్సిపల్‌ చట్టం ప్రకారం ఎన్నికల నియమావళికి ఎలాంటి అసౌకర్యం,ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టారు.రాష్ట్రంలోని మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) హెల్ప్‌లైన్‌ కమ్‌ కంట్రోల్‌ రూంను ఏర్పా టు చేసింది. ఇందుకోసం మూడు ల్యాండ్‌ లైన్‌ ఫోన్‌ నంబర్లను కేటాయించింది. ప్రజలు, రాజకీయ పార్టీలు, పోటీ చేసే అభ్యర్థులు తమకున్న ఫిర్యాదులను 040–29802895, 040–29802897 నంబర్లకు ఫోన్‌ చేసి చెప్పవచ్చని, 040–29801522 నంబరుకు ఫ్యాక్స్‌ ద్వారా తెలియజేయవచ్చని పేర్కొంది.
ఎన్నికల్లో రేట్ చార్జీలు...
మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు చేసే ఖర్చులపై ఎన్నికల వ్యయ పరిశీలకులతో ప్రత్యేక నిఘా బృందాలతో పర్యవేక్షించనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వెంకట్రావు ఆధ్వర్యంలో జిల్లా పర్చేజెస్‌ కమిటీలో రేట్‌ ఆఫ్‌ చార్ట్‌ను నిర్ణయిస్తూ శుక్రవారం సర్క్యులర్‌ను విడుదల చేశారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నివేదించాల్సిన ఖర్చుల వివరాలను ఈ రేట్‌ ఫర్‌ చార్ట్‌ను ఆధారంగా చేసుకొని బిల్లులను మున్సిపల్‌ కమిషనర్లకు ఎప్పటికప్పుడు సమర్పించాల్సి ఉంటుందని కలెక్టర్‌ పేర్కొన్నారు.లౌడ్‌ స్పీకర్స్, యాంపిల్‌ ఫైర్, మైక్రోఫోన్‌ లేబర్‌ చార్జీలతో కలిపి ఒకరోజుకు రూ.1,450, కన్‌స్ట్రక్షన్‌ ఆఫ్‌ పోడియం ఒకరోజుకు రూ.2,850, ఫ్లెక్సీ బ్యానర్‌ సైజ్‌ 10/12 రూ.1,200, క్లాత్‌ బ్యానర్‌ రూ.200, క్లాత్‌ ఫ్లాగ్స్‌ రూ.40, ప్లాస్టిక్‌ ప్లాగ్స్‌ సైజ్‌ 6/4 రూ.8, పోస్టర్‌ సింగిల్‌ కలర్‌ 18/23 రూ.8, మల్టీకలర్‌ పోస్టర్‌ సైజ్‌ 18/23 రూ.10, హోర్డింగ్‌ సైజ్‌ 8/12 లేబర్‌ చార్జీలతో కలిపి రూ.8,500, కటౌట్స్‌ (ఉడెన్‌) లెబర్‌ చార్జెస్‌తో 14/4 రూ.9 వేలు, కటౌట్స్‌ క్లాత్, ప్లాస్టిక్‌ 12/4 రూ.5 వేలు, వీడియోగ్రాఫర్, కెమెరామెన్‌ రూ.1,250, ఎరక్షన్‌ ఆఫ్‌ గేట్స్‌ 15/12 రూ.2,800గా ధరలు నిర్ణయించారు.వాహనాల చార్జీల విషయానికి వస్తే జీపు డ్రైవర్‌ బత్తతో కలిపి రూ.1,500, టెంపో/ ట్రక్‌ రూ.2,900, సుమో ఒకరోజుకు ఏసీ రూ.2 వేలు, ప్యూల్‌ రూ.వెయ్యి, నాన్‌ ఏసీ రూ.1,200, ప్యూల్‌ రూ.650, వ్యాన్‌ (డీసీఎం) ఒకరోజుకు రూ.2,900, ఫ్యూల్‌ రూ.వెయ్యి, వ్యాలీస్‌ ఒకరోజు ఏసీ రూ.2 వేలు, నాన్‌ ఏసీ రూ.1,200, ఇన్నోవా ఏసీ ఒకరోజు రూ.2,500, కారు ఒక రోజుకు రూ.1,200, త్రీ వీలర్‌ ఒకరోజుకు రూ.750, హోటల్‌ చార్జీలు ఏసీ రూ.1,600 ఒకరోజుకు, నాన్‌ ఏసీ రూ.800లు గెస్ట్‌హౌస్‌ రూ.400, చార్జెస్‌ ఆఫ్‌ డ్రైవర్స్‌ జీతాలు ఒకరోజు బత్త రూ.500, కుర్చీలు ఒకరోజుకు రూ.9, సోఫా రూ.250, హియరింగ్‌ చార్జెస్‌ హోర్డింగ్‌ సైట్స్‌ మున్సిపాలిటీ అథారిటీస్‌ రూ.500, టెంట్లు సైజు 18/36 రూ.800, 12/24 రూ.600, రూ.700, కార్పెట్స్‌ బిగ్‌ సైజ్‌ రూ.200, స్మాల్‌ సైజ్‌ రూ.150, సైడ్‌ వాల్స్‌ రూ.125, వాటర్‌ డ్రమ్స్‌ ఒకరోజుకు రూ.50, గ్లాసులు రూ.3, రైస్‌ ప్లేట్స్‌ రూ.4, ఐరన్‌ టేబుల్‌ రూ.50గా ధరలను నిర్ణయించారు. మొత్తంగా ప్రతి కౌన్సిలర్‌ అభ్యర్థి నామినేషన్‌ వేసినప్పటి నుంచి కౌంటింగ్‌ వరకు రూ.లక్ష మించకుండా ఖర్చుచేయాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.   

Related Posts