YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

 చేపల కోసం రిటైల్ కియోస్క్‌లు

 చేపల కోసం రిటైల్ కియోస్క్‌లు

 చేపల కోసం రిటైల్ కియోస్క్‌లు
హైద్రాబాద్, జనవరి 17, 
హైదరాబాద్‌లో చేపల విక్రయాలను  ప్రొత్సహించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. కొత్తగా 15 చేపల మార్కెట్ల ఏర్పాటుకు అదికారులు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వగా, రిటైల్ అమ్మకాల కోసం వివిధ ప్రాంతాల్లో కియోస్క్‌ల ఏర్పాటును అధికారులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే దీనిపై ఓ ప్రణాళికను రూపొందించే పనిలో జిల్లా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ అడుగు ముం దుకేసిన జిల్లా అధికారులు చేపల మార్కెటింగ్‌పై దృష్టిపెట్టారు. నగరంలో విస్త్రృతంగా చేపల మార్కెట్లను నిర్మించేందుకు సిద్ధమయ్యారు. తొలి దశలో కొత్తగా 15 మార్కెట్లను నిర్మించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 500 నుంచి వెయ్యి చదరపు అడుగుల్లో ఈ మార్కెట్లను నిర్మించనున్నారు. వీటిలో 30 మంది వరకు విక్రయదారులు అమ్మకాలు సాగించేలా ఏర్పాట్లు చేయనున్నారు. అమ్మకాలు సాగించడానికి వీలుగా ప్లాట్‌ఫాంలు, పార్కింగ్ సదుపాయం, చేపలను శుభ్రం చేయడానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయనున్నారు. ఇందుకోసం ఒక్కో మార్కెట్ నిర్మాణానికి గాను రూ. 7.5 లక్షలను వెచ్చించబోతున్నారు. మార్కెట్ల నిర్మాణానికి వీలుగా జిల్లా రెవెన్యూ అధికారులు స్థలాల వేటలో పడ్డారు. ప్రాథమికంగా జిల్లాలోని షేక్‌పేట, మాదన్నపేట, వారాసిగూడ, ఖైరతాబాద్, కవాడిగూడ, తుకారాంగేట్ ప్రాంతాలను పరిశీలిస్తుండగా, అందుబాటులో ఉన్న స్థలాలను బట్టి మరికొన్ని ప్రాంతాలను ఎంపిక చేయబోతున్నారు. 3 మాసాల వ్యవధిలో ఈ మార్కెట్లను సిద్ధం చేయాలని అధికారులు సంకల్పం తీసుకున్నారు. చేపల విక్రయాలను గాడినపెట్టేందుకు జిల్లా మత్స్యశాఖ అధికారులు నడుం బిగించారు. ఇందుకోసం పలు ప్రాంతాల్లో రిటైల్ కియోస్క్‌లను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం విక్రయదారులంతా రోడ్లమీదే అమ్మకాలు సాగిస్తుండటం..కంపువాసనలు వస్తుండటంతో వీటికి అడ్డుకట్టవేయాలని భావించిన అధికారులు కియోస్క్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఎర్రగడ్డ, ట్యాంక్‌బండ్, చింతల్‌బస్తీ, బంజారాహిల్స్, నందినగర్, సంతోష్‌నగర్, మలక్‌పేట, చాదర్‌ఘాట్ సహా నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో రోడ్లమీదే అమ్మకాలు సాగిస్తున్నారు. వీరికి సరైన సౌకర్యాలు లేకపోవడంతోనే ఇలా అమ్మకాలు సాగిస్తున్నారని జిల్లా అధికారులు గుర్తించారు. జిల్లాలో 15 మత్య్సకార సహాకార సంఘాలు, మరో 4 మత్స్యకార మార్కెటింగ్ సహాకారసొసైటీలున్నాయి. వీటిలో 1422 మంది సభ్యులున్నారు. మరో 20 మత్స్యకార మహిళా సహకార సొసైటీలుండగా, వీటిలో 1349 మంది సభ్యులున్నారు. మత్స్య మిత్ర పేరుతో మరో 84 స్వయం సహాయక గ్రూపులున్నాయి. వీరందరూ రోడ్లమీదే చేపల విక్రయాలను కొనసాగిస్తున్నారు. వీరి చింతలకు చెక్‌పెట్టేందుకు ఆయా ప్రాం తాల్లో అమ్మకాలు సాగించడానికి వీలుగా కియోస్క్‌లను ఏర్పాటు చేయనున్నారు

Related Posts