ప్రభల తీర్ధాల సందడి
కాకినాడ జనవరి 17,
తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో ప్రభల తీర్థాలతో సంక్రాంతి, కనుమ పండుగ సందర్బంగా ఆధ్యాత్మిక పరవళ్లు తొక్కింది. చిన్న పెద్దా అనే తేడా లేకుండా సీమలో పలు ప్రాంతాల్లో ప్రభల తీర్థాలతో సరికొత్త శోభను సంతరించుకున్నాయి.ఓ వైపు సంక్రాంతి సందర్బంగా పందెం కోళ్లు బరిలో కధం తొక్కితే ... మరోవైపు రికార్డింగ్ డాన్సులు యద్దెచ్చగా జరిగాయి.ముఖ్యంగా కనుమ పండగ నాడు పచ్చని సీమలో రంగురంగులు హద్దుకున్న ప్రభలు కొలువుదీరాయి. ఊరేగింపుగా వెళుతూ వీధులు, చేలు, తోటలను పుణీతం చేశాయి.ఈ గ్రామం తిరునాళ్లు చూసినా ఇసుక వేస్తే రాలని జనంతో కిటకిటలాడాయి. సముద్ర ఘోషను తలపించేలా వేలాది మంది భక్తుల ఓంకార నాదాలు..వందల మంది భక్తులు తమ భుజస్కాందాలపై ప్రభులను మోస్తూ ముందుకు సాగారు.కోనసీమలో ఈ తీర్థాలు నాలుగు రోజులపాటు సాగుతాయి.గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది సంక్రాంతి పండుగ సంబరాల్లో భాగంగా కొత్త ప్రాంతాల్లో కూడా ప్రభల తీర్థలు జరిగాయి. తీర్థాలకు కొత్త ప్రభలు కూడా తరలిరావడంతో సందడి వాతావరణం నెలకొంది.