కొనసాగుతున్న జల్లికట్టు పోటీలు
మధురై జనవరి 17,
తమిళనాడులో పొంగల్ (సంక్రాంతి) సందర్భంగా నిర్వహించే సంప్రదాయక జల్లికట్టు క్రీడలు కొనసాగుతున్నాయి. శుక్రవారం మధురై జిల్లాలోని అలంగనల్లూరు పట్టణంలో జల్లికట్టు క్రీడలను అక్కడి స్థానిక నేతలు పచ్చజెండా ఊపి ప్రారంభించారు. 700కు పైగా ఎద్దులు ఈ క్రీడల్లో పాల్గొంటున్నాయి. జల్లికట్టు పోటీల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండాతమిళనాడు ప్రభుత్వం 2 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. మధురైలోని అవనీయపురంలో నిర్వహించిన జల్లికట్టు పోటీల్లో పలువురికి తీవ్రగాయాలైన విషయం తెలిసిందే. గాయాలైన వారికి ఆస్పత్రుల్లో చికిత్సనందించారు.