YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో అధికార టీడీపీకి పరాభవం

Highlights

  • ఏపీలో అధికార టీడీపీకి పరాభవం 
  • బహిష్కరించిన ప్రతిపక్షాలు 
     
ఏపీలో అధికార టీడీపీకి పరాభవం

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి బహుశా గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదురై ఉండకపోవచ్చు. ఆయన్ను ఏకంగా పలు ప్రధాన పార్టీలు ఇంచుమించు ‘బహిష్కరించినంత పనిచేశాయి’.ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అయితే అసలు చంద్రబాబును నమ్మి ఈ సమావేశానికి రావాలా? అని ప్రశ్నించింది. ఆ ఉద్యమం ఏదో తాము సొంతంగా చేసుకుంటున్నామని…తాము హాజరుకాబోమని తేల్చిచెప్పేసింది. ఇక సభలో ప్రాతినిధ్యం లేకపోయినా..ఒకప్పటి ఫ్రెండ్ కదా..మచ్చిక చేసుకోవచ్చు అని పవన్ కళ్యాణ్ ని ఆహ్వానిస్తే ఆయన కూడా చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా విషయంలో ప్రజల ఆగ్రహం వ్యక్తం అయ్యాక..మీ పాపం తలా పిడికెడు పూసేందుకు ఇఫ్పుడు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తారా? అంటూ ప్రశ్నించారు. ఈ పని మూడేళ్ల కిందట చేయాల్సింది అని వ్యాఖ్యానించారు. చంద్రబాబునాయుడు తన 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఇంత దారుణమైన పరిస్థితిని ఎప్పుడూ చూసి ఉండరని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.
గత నాలుగేళ్లుగా విభజిత ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని సమస్యలు వచ్చినా..ఎన్ని విమర్శలు వచ్చినా కనీసం ఒక్కటంటే ఒక్క అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయని చంద్రబాబు…ఇప్పుడు మాత్రం తన తప్పులను అందరికీ అంటకట్టేందుకు ‘అఖిల సంఘాల’ సమావేశం అంటూ ఓ కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఆయన నిర్వహించే అఖిలపక్ష సంఘాల సమావేశానికి సభలో ప్రాతినిధ్యం ఉన్న ఏ ఒక్క పార్టీ కూడా హాజరుకాకూడదని నిర్ణయం తీసుకోవటంతో ఇంచుమించు అవి చంద్రబాబును బహిష్కరినంత పనిచేసినట్లే.  నిన్న మొన్నటివరకూ చెట్టపట్టాలేసుకుని తిరిగిన బిజెపి కూడా తూచ్..పొమ్మంది. చివరకు ఏపీలో ఏ మాత్రం ప్రాతినిధ్యం లేకుండా పోయిన కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం పార్టీలు మాత్రమే ఈ సమావేశానికి హాజరుకానున్నాయి. వీళ్లు కూడా సమావేశంలో చంద్రబాబు తీరును ఖచ్చితంగా ఎండగట్టడం ఖాయంగా కన్పిస్తోంది.  చంద్రబాబుకు చేతనైతే తమిళ రైతులు ఢిల్లీలో ధర్నా చేసినట్లు ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పార్లమెంట్ ముందు  ధర్నా చేయాలని సూచించారు.

Related Posts