YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఓలెక్స్  తత్వవేత్తగా పవన్ కళ్యాణ్

ఓలెక్స్  తత్వవేత్తగా పవన్ కళ్యాణ్

ఓలెక్స్  తత్వవేత్తగా పవన్ కళ్యాణ్
తాడేపల్లి జనవరి 17 
అధిక చార్జీలు వసూళ్లు చేస్తే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని ప్రైవేట్ యాజమాన్యంను హెచ్చరించాం. ప్రయాణికుల పిర్యాదుపై చర్యలు తీసుకున్నామని మంత్రి పేర్ని నాని అన్నారు. శుక్రవారం అయన మీడియాతో మాట్లాడారు. జనవరి 2 నుంచి 16 వ వరకు 3132 కేస్ లు నమోదు చేసాము. రాష్ట్ర వ్యాప్తంగా 552 బస్సులను సీజ్ చేసాం. పండగ సందర్భంగా ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా అధిక బస్సులను నడిపామని అన్నారు. ఈ రోజు నుంచి 20 తేదీ వరకు ప్రయివేట్ ట్రావెల్స్ పై రైడ్స్ నిర్వహిస్తాం. పండగ పేరుతో ప్రయాణికులు దగ్గర నుంచి డబ్బులు వసూళ్ళు చేస్తామంటే జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోరు. పవన్ కళ్యాణ్ చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఈ భూమి మీద పచ్చి అవకాశవాద రాజకీయ నేత ఎవరైనా ఉన్నారు అంటే అది పవన్ కళ్యాణ్ నే. అవకాశవాద రాజకీయానికి చంద్రబాబు అంబాసిడర్ ఉండే వారు. చంద్రబాబు కోరిక మేరకు పవన్ కళ్యాణ్ అవకాశ వాద రాజకీయాలు చేస్తున్నారు. అవకాశ వాద రాజకీయానికి కొత్త చిరునామాగా పవన్ నాయుడు తయారయ్యారు. బేషరతుగా ఎందుకు పవన్ కళ్యాణ్ బీజేపీ కి మద్దతు తెలిపారు. షరతులు పెట్టి హోదా అడిగి బీజేపీకి మద్దతు తెలపొచ్చు కదా అని అడిగారు. ఎందుకు మోడీని అమిత్ షా ను హోదా పవన్ కళ్యాణ్ అడగలేదు. బేషరతుగా మద్దతు అని చెప్పడానికి సిగ్గు లేదా. ఎందుకు బేషరతుగా మద్దతు అంటున్నారు... మీద ఏమి కేసులు ఉన్నాయి. ఓఎల్ క్స్ వెబ్ సైట్ లో పార్టీను అమ్మకానికి పెట్టుకోవచ్చు అనే విధంగా పవన్ తయారయ్యాడు.  ఓలెక్స్  తత్వవేత్తగా పవన్ కళ్యాణ్ తయారయ్యాడని మంత్రి విమర్శించారు.

Related Posts