పోలియో మహమ్మారిని తరిమేయాలి
జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్.
కర్నూలు, జనవరి 18
పుట్టిన బిడ్డ నుంచి ఐదేళ్ల లలోపు పిల్లలందరికీ పల్స్ పోలియో చుక్కలు విధిగా వేయించి పోలియో మహమ్మారిని తరిమేయాలని జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ సూచించారు. శనివారం స్థానిక కలెక్టరేట్లో ఆవరణం సమీపంలో పల్స్ పోలియో అవగహన ర్యాలీని కలెక్టర్ జి. వీరపాండియన్, కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ 2 సయ్యద్ ఖాజా మొహిదీన్, డి ఎం హెచ్ ఓ నరసింహులు, జెడ్పీ సీఈఓ ప్రభాకర్ రావు, కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ రవీంద్రబాబు లు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. అదేవిధంగా పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ ఐదేళ్లలోపు పిల్లలందరికీ పల్స్ పోలియో చుక్కలు వేయించి ఆరోగ్యవంతమైన జీవితాన్ని అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి శ్రీదేవి, అడిషనల్ డిఎంహెచ్ఓ చంద్ర రావు, ఐసిడిఎస్ పిడి భాగ్య రేఖ, వైద్యాధికారులు, ఆశ, అంగన్వాడి కార్యకర్తలు, నర్సింగ్ కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.