YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు విద్య-ఉపాధి తెలంగాణ

ఓయూలో ప్రోఫెసర్ ఖాసీం ఆరెస్టు

ఓయూలో ప్రోఫెసర్ ఖాసీం ఆరెస్టు

ఓయూలో ప్రోఫెసర్ ఖాసీం ఆరెస్టు
హైదరాబాద్  జనవరి 18,
ఉస్మానియా యూనివర్శిటీ ప్రొఫెసర్ ఖాసింను పోలీసులు అరెస్ట్ చేశారు. విరసం కార్యదర్శిగా ఇటీవలే ఎన్నికైన ప్రొఫెసర్ ఖాసింకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో శనివారం ఉదయం నుంచి ఆయన ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఓయూ క్యాంపస్ ఆవరణలోని క్వార్టర్స్లో ఆయన ఉంటున్నారు. గజ్వేల్ డీఎస్పీ  నారాయణ ఆధ్వర్యంలో పోలీసులు ఆయన ఇంట్లో సోదాలు జరిగాయి. దాదాపు ఐదు గంటలుగా సోదాలు జరిగాయి. ఈ తనిఖీల్లో కీలక డాక్యుమెంట్లు, కంప్యూటర్ హార్డ్ డిస్కులు, రెండు బ్యాగుల విప్లవ సాహిత్యం, కరపత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అయనను అదుపులోకి తీసుకుని గజ్వేల్కు తరలించారు. కాగా ప్రొఫెసర్ ఖాసిం ఇంట్లో పోలీసుల సోదాలను విద్యార్థులు ఖండించారు. ఓయూలోని ఖాశిం నివాసం ఎదుట విద్యార్థులు ఆందోళనలకు దిగారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ప్రొఫెసర్  కాసీం అరెస్టును అయన భార్య స్నేహాలత ఖండించారు. ఐదు సంవత్సరాల క్రితం జరిగిన కేసులో ఈరోజు గజ్వేల్ పోలీసులు సోదాలు చేశారు. 2016 లో అక్రమంగా బనాయించిన కేసులో ఈరోజు అరెస్ట్ చేశారని ఆరోపించారు. 2016 హైదరాబాద్ నుండి  ఆదిలాబాద్ వెళ్తున్న శ్యామ్ సుందర్ అనే వ్యక్తి దగ్గర దొరికిన పుస్తకాల పై కేసు నమోదు చేశారు. నేను తెలంగాణ వాడినే అనే పుస్తకం తో పాటు  ఎస్సి , ఎస్టీ  వర్గీకరణ పై రాసిన పుస్తకాల పై కేసు నమోదు చేశారు. ప్రభుత్వం ను ప్రశ్నించినందుకు తప్పుఫు కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. తలపులు పగలగొట్టి అక్రమంగా లోపలికి వచ్చారు. కంప్యూటర్ హర్డ్ డిస్క్ లను ఇంట్లో ఉన్న పుస్తకాలను తీసుకెళ్లారు. ఖాసీం ఆరెస్టుపై  హైకోర్టు ను ఆశ్రయిస్తానని అన్నారు. 

Related Posts