Highlights
- అతిరాత్ర యాగానికి చురుగ్గా ఏర్పాట్లు
- పోకచెట్టు స్థంభాలతో యాగశాల
తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం పట్టణంలో స్థానిక పాండవులమెట్ట సమీపాన ఏప్రిల్ నెల 14 నుంచి నిర్వహించ తలపెట్టిన అతిరాత్ర ఊత్క్రుష్ట శ్రౌత సోమయాగ క్రతువుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. యాగకర్త కేశాప్రగడ హరనాథశర్మ, సహాయ యాగకర్త కేశాప్రగడ రాజశేఖరశర్మ పర్యవేక్షణలో యాగశాల నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా యాగశాల నిర్మాణానికి కర్ణాటక రాష్ట్రంలోని షిమోగా నుంచి పోకచెట్టు స్థంభాలతో సోమవారం ప్రత్యేక వాహనం చేరుకుంది. యాగస్థలి వద్ద పోకచెట్టు స్థంభాలతో యాగశాల నిర్మాణం చేపట్టడం జరుగుతుందని యాగకర్త హరనాథశర్మ తెలిపారు. అలాగే నిత్యం యాగస్థలి వద్ద లలితా, విష్ణు సహస్రనామ పారాయణాలు జరుగుతున్నట్లు ఆయన తెలిపారు.