YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఎంఐఎం తో పోత్తు లేదు

ఎంఐఎం తో పోత్తు లేదు

ఎంఐఎం తో పోత్తు లేదు
హైదరాబాద్ జనవరి 18
ఎంఐఎం పార్టీతో టీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు పెట్టుకోదని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ  తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం అయన టీఆర్ఎస్ భవన్లో మీడియాతో మాట్లాడారు. ఎంఐఎంతో తమకు ఎలాంటి పొత్తు లేదని మంత్రి స్పష్టం చేశారు.  పోత్తు విషయంపై  కావాలనే కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణలో ఎంఐఎం పార్టీది పరిమితమైన రోల్మాత్రమే ఉంటుందన్నారు. మజ్లిస్పార్టీ పాతబస్తీకి పరిమితమైనపార్టీగా ఆయన పేర్కొన్నారు ఎంఐఎం పోటీచేసిన చోట కాంగ్రెస్ ఎందుకు పోటీ చేయడం లేదని ఆయన ప్రశ్నించారు.  అధికారంలో ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి అన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఆడలేక మధ్యలో ఓడినట్టుగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు.  టీఆర్ఎస్ పార్టీసెక్యులర్ భావాలున్న పార్టీగా ఆయన అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీకి అన్ని చోట్ల పోటీకి అభ్యర్దులు లేరు. అందుకే అన్నిచోట్ల పోటీ చేయడం లేదని విమర్శించారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన వారిపై కేసులు పెడతామని ఈ సందర్భంగా మంత్రి  హెచ్చరించారు. కేంద్రం తెలంగాణకు ఇచ్చిన నిధులపై చర్చించేందుకు ఏ సెంటర్లోనైనా రెడీ అన్నారు. కిషన్రెడ్డితో చర్చకు ఎప్పుడైనా సిద్ధమేనని అన్నారు ఎంఐఎంపార్టీతో కలిసి ఉంది ఎవరో అందరికీ తెలిసిందేనని అన్నారు ఈనెల 25 తర్వాత బహిరంగ చర్చకు సిద్ధమని చెప్పారు. ఎవరి సపోర్ట్లేకుండానే ఈఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీని సాధిస్తుందన్న ధీమాను తలసాని వ్యక్తం చేశారు. పట్టణ ప్రాంత అభివృద్ధికి టీఆర్ఎస్ ఎంతో కృషి చేస్తోందని, రాష్ట్రంలో 24గంటల విద్యుత్, మిషన్భగీరథ, మిషన్కాకతీయ అద్భుతంగా సాగుతున్నాయని అన్నారు. మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతతోందని మంత్రి తలసాని వెల్లడించారు.  మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రచారం బ్రహ్మాండంగా జరుగుతుందనీ, ఈ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అవుతుందని తలసాని అన్నారు.

Related Posts