YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

పనిచేసే వారికి ఓటెయ్యండి

పనిచేసే వారికి ఓటెయ్యండి

పనిచేసే వారికి ఓటెయ్యండి
వేములవాడ జనవరి 18 
పనిచేసే నాయకులకే ఓటు వేయాలని మంత్రి, తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రజలను అర్థించారు. శనివారం అయన వేములవాడలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కేటీఆర్ మాట్లాడుతూ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు సరిగా పనిచేయకపోతే వారిని తొలగిస్తామని స్పష్టం చేశారు. రాబోయే నాలుగేళ్లలో యావత్ దేశం ఆశ్చర్యపోయేలా తెలంగాణను ముందుకు తీసుకెళతామని, పట్టణాలను అద్భుతమైన రీతిలో అభివృద్ధి బాటలో నడిపిస్తామని తెలిపారు. గోదావరి నీళ్లను తీసుకొచ్చి సిరిసిల్ల, వేములవాడ బీడు భూములను సస్యశ్యామలం చేస్తున్నామని అన్నారు. రాబోయే రోజుల్లో ఒక్క సిరిసిల్ల జిల్లాలోనే రెండు లక్షల ఎకరాలకు నీళ్లొస్తాయని మంత్రి తెలిపారు. వేములవాడ పుణ్యక్షేత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామనీ, యాదాద్రి ఆలయ పనులు త్వరలోనే పూర్తికానున్నాయని మంత్రి తెలిపారు. సీఎం కేసీఆర్ దృష్టంతా ఇక వేములవాడ, భద్రాచలం ఆలయాల అభివృద్ధిపైనే ఉందన్నారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ అధికారంలో లేని కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం అంటే అభివృద్ధిని అడ్డుకోవడమేనని వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలకు పనికంటే మాటలు ఎక్కువని, అలాంటి వాళ్లకు ఓటు వెయ్యడం వృథా అని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వని బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలంటూ ప్రశ్నించారు. రూ.19వేల కోట్లు మిషన్ భగీరథకు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫార్సు చేస్తే కేంద్రం పట్టించుకోలేదన్నారు. ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వని బీజేపీకి ఓటేయాలా అని ప్రశ్నించారు. రానున్న నాలుగేళ్లలో పట్టణాలను బ్రహ్మాండంగా తీర్చిదిద్దుతామన్నారు. రాష్ట్రంలోని పట్టణాలను దేశానికే ఆదర్శంగా నిలిపే బాధ్యత తనదన్నారు. అభివృద్ధి కావాలంటే కారు గుర్తుకు ఓటేయాలన్నారు.

Related Posts