YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కాంగ్రెస్ అభివృద్ధి మచ్చుకైనా కానరాదు- మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపణ

కాంగ్రెస్ అభివృద్ధి మచ్చుకైనా కానరాదు- మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపణ

కాంగ్రెస్ అభివృద్ధి మచ్చుకైనా కానరాదు- మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపణ
జగిత్యాల 
జనవరి 19 
జగిత్యాల పట్టణం అనేక సమస్యలను ఎదుర్కొంటున్న పట్టణం గా చెప్పుకోవచ్చని, 9సార్లు కాంగ్రెస్ పార్టీనే గెలిచింది కానీ, అభివృద్ధి పనులు చూస్తే మచ్చుకైనా కానరావడం లేదని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు.  కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక టీఆరెస్ పార్టీ కార్యాలయంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అధ్యక్షతన విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి మచ్చుకైనా ఒకటి చేసిన అని చెప్పుకోవడానికి కూడా పనులు లేవన్నారు. జగిత్యాల జిల్లా గా ప్రకటించడం అనేది ఎన్నో సం.ల కల అని, అది టీఆరెస్ ప్రభుత్వం మాత్రమే నెరవేర్చిందన్నారు. అర్బన్ డెవలప్మెంట్ కోసం డైరెక్ట్ గా బడ్జెట్ లో మునిసిపాలిటీల అభివృద్ధి కోసం నిధులు కేటాయించామని తెలిపారు. దానిలో భాగంగానే జగిత్యాల మునిసిపాలిటీ కి 50కోట్ల నిధులను మంజూరు చేసామని వివరించారు. జీవన్ రెడ్డి మంత్రి గా ఉన్న కూడా అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్నో అబద్ధాలు చెప్పి ఎంపీ అయిన అరవింద్ ఇప్పటి వరకు పత్తా లేడు. కవిత ఎంపీగా ఉన్నప్పుడు నెలకు మూడు నాలుగు సార్లు వచ్చి ఇక్కడ మంచి చెడ్డ చూసారని అన్నారు.  ఇక్కడి పాలకులు పదే పదే  చెప్తారు జేఎన్టీయూ కాలేజ్ ఏర్పాటు చేశామని మరి అది ఎక్కడో మూలన ఏర్పాటు చేసి ఎలాంటి ప్రయోజనం లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ 48 స్థానాలకు 10 స్థానాల్లో అభ్యర్థులు పోటీ చేయడానికి లేరని, పసుపు బోర్డు గురించి అడిగితే ఎంపీ తప్పించుకొని తిరుగుతున్నాడని ఆరోపించారు. బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆరెస్ ప్రభుత్వం అని, జగిత్యాల పట్టణ అభివృద్ధి కేవలం ఒక్క టీఆరెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందన్నారు.  జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ జగిత్యాల మునిసిపల్ ఏర్పడినప్పటి నుండి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది మరి ఈ సారి గులాబీ జెండా ఎగరవేయలని ముందుకు సాగుతున్నామన్నారు. జగిత్యాల లో ప్రతిపక్ష నాయకులు ప్రశ్నించడం తప్ప పని చేసే వారు కాదన్నారు.  అరవింద్ ఎంపీగా గెలిచి 9 నెలలు గడిచిన  అభివృద్ధి గురించి పని చేసిన అని కాదు ఈ పని చేస్తా అని చెప్పలేదన్నారు. కాంగ్రెస్ కుటుంబ పాలన తో 40 సం. లు పాలించి జగిత్యాలను అస్తవ్యస్తం చేశారని  రోపించారు. టీఆరెస్ ఖచ్చితంగా 48 వార్డులో గెలిచి తీరుతామని ఆశాభావం వ్యక్తం చేశారు.   జగిత్యాల పట్టణంలోని పలు వీధుల్లో మంత్రి కొప్పుల ఈశ్వర్ టిఆరెస్ అభ్యర్ధులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఓపెన్ టాప్ వాహనం పై నుండి ఓటర్లను ఉద్దేశించి మంత్రి మాట్లాడారు.  ఈ సమావేశంలో టిఆరెస్ అభ్యర్థులు, రాష్ట్ర నాయకులు, దావా సురేష్, గట్టు సతీష్, బోగ వెంకటేశ్వర్లు, బోగ ప్రవీణ్, బాలే శంకర్, దేవేందర్ నాయక్, రాజు, సతీష్, రాజన్న, లక్మ న్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts