YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 ఏడు బిల్లులకు మంత్రివర్గం ఆమోదం

 ఏడు బిల్లులకు మంత్రివర్గం ఆమోదం

 ఏడు బిల్లులకు మంత్రివర్గం ఆమోదం
అమరావతి జనవరి 20 
ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. సోమవారం ఉదయం గంటపాటు కొనసాగిన ఈ సమావేశంలో మొత్తం ఏడు బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. హైపవర్ కమిటీ నివేదిక, సీఆర్డీఏ చట్టం ఉపసంహరణ బిల్లు, అమరావతి మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ కమిటీల నివేదికలపై అధ్యయనం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన హై పవర్‌ కమిటీ పలుమార్లు సమావేశమై విస్తృతంగా చర్చించింది. రాజధానిలో ఇన్సైడర్ ట్రేడింగ్ అంశంపై టేబుల్ ఐటమ్గా చర్చించడానికి నిర్ణయించారు. విచారణను లోకాయుక్తకు అప్పచెప్పాలని కేబినెట్ నిర్ణయించింది. రాజధాని రైతులకు అదనపు ప్రయోజనం కల్పించాలని నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా పులివెందుల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుకు, 11 వేల రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. విశాఖకు పరిపాలన రాజధాని తరలింపు, సీఆర్డీఏ స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ అథారిటీ ఏర్పాటు, ఇన్ సైడర్ ట్రేడింగ్ పై లోకాయుక్త తో విచారణ,  రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు చేయాలని కుడా నిర్ణయించింది.  హెచ్వోడీ కార్యాలయాలు కేటాయింపుకు ఏపీ కేబినెట్ నిర్ణయించింది. అమరావతిలోనే అసెంబ్లీ కొనసాగించేలా, కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు, రాజధాని రైతులకు మెరుగైన ప్యాకేజీ, భూములు ఇచ్చిన రైతులకు కౌలు 15 ఏళ్లకు పెంచేలా.. పలు నిర్ణయాలను ఏపీ కేబినెట్ తీసుకుంది.

Related Posts