YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అమరావతిలో  తీవ్ర ఉద్రిక్తపరిస్థితులు కొనసాగుతున్నాయి ..... 

అమరావతిలో  తీవ్ర ఉద్రిక్తపరిస్థితులు కొనసాగుతున్నాయి ..... 

అమరావతిలో  తీవ్ర ఉద్రిక్తపరిస్థితులు కొనసాగుతున్నాయి ..... 
అసెంబ్లీ ముట్టడికి టీడీపీ పిలుపివ్వడంతో... హైఅలర్ట్ కొనసాగుతోంది. ప్రధానంగా... ఈ సమావేశాలకు సీఎం జగన్‌ను కట్టుదిట్టమైన భద్రత మధ్య తీసుకురానున్నారు. సీఎం జగన్... తన ఇంటి నుంచీ... సచివాలయానికి ఎలా రావాలన్న అంశంపై ఆదివారం ఆల్రెడీ ట్రయల్ రన్ నిర్వహించారు. ఆ రూట్ మొత్తం భారీ బందోబస్తు ఉంచుతున్నారు. కొన్ని కీలక పాయింట్లలో మూడంచెల భద్రత కల్పిస్తున్నారు. కొన్ని చోట్ల చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేశారు.అయినప్పటికీ ఇది సాధ్యమవుతుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.  ఇన్ని చేసినా సీఎం జగన్‌ను ప్రజలు అడ్డుకుంటారనే టెన్షన్ లోలోన ఉంది. మరోవైపు అమరావతి రైతులు చేస్తున్న ఆందోళనలు 33వ రోజుకు చేరాయి. రోజూ రిలే దీక్షలు చేస్తున్నారు. వంటా వార్పులు కొనసాగుతున్నాయి. మహిళలైతే... దుర్గమ్మే కాపాడాలంటూ... ఆదివారం కలశాలతో ర్యాలీ చేశారు. ఆదివారం ఇద్దరు రైతులు కూడా చనిపోయారు. వారు రాజధానిపై ఆవేదనతోనే చనిపోయారని స్థానికులు అంటున్నారు. నెలకు పైగా ఆందోళనలు చేస్తున్నా... రైతులకు అన్యాయం జరగనివ్వం అని ప్రభుత్వం చెబుతోందే తప్ప... రాజధానిని తరలించం అని మాత్రం చెప్పట్లేదని తీవ్ర ఆవేశం, ఆగ్రహంతో రగిలిపోతున్నారు అమరావతి ప్రాంతీయులు. సీఎం జగన్ అక్కడ కాలుపెడితే... ఏం జరుగుతుందో అనే టెన్షన్ పోలీస్ బాసుల్లో ఉంది. ప్రజలపై సీరియస్‌గా వ్యవహరిస్తే... లా అండ్ ఆర్డర్ సమస్య మరింత జఠిలం అవుతుందేమోనన్న భయాలున్నాయి. అలాగని ప్రజలను ఆందోళనలు చేసుకోనిస్తే... వాళ్లు శృతి మించుతారేమోనన్న టెన్షన్ కూడా ఉంది. ప్రభుత్వ వర్గాలు మాత్రం... ఆందోళనలు చేయిస్తున్నది టీడీపీ వర్గాలేనని ఆరోపిస్తున్నాయి. రాజకీయ స్వార్థంతో లేనిపోని భయాల్ని అమరావతి ప్రజల్లో సృష్టిస్తున్నారని మండిపడుతోంది.

Related Posts