YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఎంపీ నాని హౌజ్ ఆరెస్టు

ఎంపీ నాని హౌజ్ ఆరెస్టు

ఎంపీ నాని హౌజ్ ఆరెస్టు
విజయవాడ  జనవరి 20 
టీడీపీ ఎంపీ కేశినేని నానిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేసారు. సోమవారం ఉదయాన్నే కేశినేని నాని ఇంటి దగ్గర భారీగా మోహరించారు. నాని మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది. పోలీసులను వాడుకుని ప్రతిపక్షాలు గొంతు నొక్కుతున్నారు. పోలీసులు వ్యవహరుస్తున్న తీరు ఆ డిపార్ట్మెంట్ కే మాయని మచ్చగా మిగులుతుందని అన్నారు. ఒక ఎంపీని నన్ను గృహ నిర్బంధo చేయడం ఏంటి. పోలీసుల వైఖరికి ఖండిస్తున్నానని అన్నారు. నేను ఏమైన నేర చరిత్ర కలిగిన వాడినా అని నిలదీసారు. నన్ను ఎందుకు హౌస్ అరెస్ట్ చేశారు ? ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అమరావతి ప్రజల రాజధాని అటువంటి రాజధానిని మార్చడం జగన్ వల్ల కాదు. పిచ్చి పిచ్చి కమిటీలు వేసి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. రైతులు, మహిళలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఏపీ రాజధానిగా అమరావతే కొనసాగాలని ప్రజల కోరుతున్నారు. అమరావతి కోసం టీడీపీ నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుందని అన్నారు,

Related Posts