YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ

మున్సిపాల్టీ ఎలక్షన్స్ పై బెట్టింగ్

మున్సిపాల్టీ ఎలక్షన్స్ పై బెట్టింగ్

మున్సిపాల్టీ ఎలక్షన్స్ పై బెట్టింగ్
హైద్రాబాద్, జనవరి 20
రాష్ట్రంలో ఓవైపు మున్సిపల్పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ..  మరోవైపు ఎలక్షన్లపై బెట్టింగ్ స్పీడందుకుంది. ఏ పార్టీకి ఎన్ని మున్సిపాలిటీలు వస్తాయి, ఎక్కడ, ఎవరు గెలుస్తారు? అధికార, ప్రతిపక్షాల్లో కీలక నేతలున్న మున్సిపాలిటీల్లో ఎవరికెన్ని సీట్లు వస్తాయి.. అంటూ పందాల మీద పందాలు నడుస్తున్నాయి. ప్లేసును బట్టి, పోటీ జరిగే తీరును బట్టి రూ.5 వేల నుంచి రూ.10 లక్షల దాకా బెట్టింగులు నడుస్తున్నాయి. కొన్నిచోట్ల అయితే లక్షకు మూడు లక్షలు తిరిగిచ్చేలా ఆఫర్లు ఇస్తున్నట్టు సమాచారం. మన రాష్ట్రంతోపాటు ఏపీకి చెందినవారు పెద్ద సంఖ్యలో బెట్టింగులు కాస్తున్నారు.రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మున్సిపోల్స్పై బెట్టింగులు నడుస్తున్నాయి. ఇంతకాలం హైదరాబాద్‌ కేంద్రంగా పందాలు జరిగేవి. ఇప్పుడు ఖమ్మం, మహబూబ్‌నగర్‌, సూర్యాపేట, మెదక్‌, కరీంనగర్‌, నల్లగొండ, వరంగల్‌, మహబూబ్‌నగర్‌, ఆదిలాబాద్‌ల్లోనూ మొదలయ్యాయి. విదేశాల్లో ఉన్నవారు కూడా పందాలు కాస్తున్నారు.బుకీలు వాట్సాప్‌‌  వంటి వాటిలో గ్రూపులు ఏర్పాటు చేసి బెట్లు నిర్వహిస్తున్నారు. బరిలో దిగిన క్యాండిడేట్ పార్టీ, ఏ సామాజిక వర్గానికి చెందినవారు, ఆయా చోట్ల ఆ వర్గం ఓటర్ల సంఖ్య, గతంలో అక్కడ గెలిచిన పార్టీ, క్యాండిడేట్, ప్రస్తుత పరిస్థితి వంటి అంశాలన్నీ పరిశీలించి పందాలు కాస్తున్నారు. మొత్తం రాష్ట్రం వారీగా, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారీగా ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తయి, రెండో స్థానంలో ఎవరుంటారు తదితర అంశాలపై బెట్టింగ్ పెడ్తున్నారు.రూ.5 వేల నుంచి మొదలుకొని రూ.10 లక్షల వరకు బెట్టింగ్‌‌ కాస్తున్నట్టు తెలుస్తోంది. టీఆర్‌‌ఎస్‌‌ అధికారంలో ఉండటంతో ఎక్కువ మంది ఆ పార్టీపైనే బెట్టింగ్‌‌కు ఆసక్తి చూపిస్తున్నారని, కాంగ్రెస్‌‌, బీజేపీలకు బలమున్న చోట ఆయా పార్టీల వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలిసింది. ముఖ్యంగా ప్రతిపక్ష ఎంపీలు, ఎమ్మెల్యేలున్న చోట, హైదరాబాద్ శివార్లలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పందాలు జోరుగా సాగుతున్నాయి. ధర్మపురి అర్వింద్‌‌ ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్‌‌, బండి సంజయ్‌‌ గెలిచిన కరీంనగర్‌‌, ఉత్తమ్‌‌  నెగ్గిన నల్లగొండ, రేవంత్‌‌ రెడ్డి గెలిచిన మల్కాజ్‌‌గిరి సెగ్మెంట్ల పరిధిలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లపై ఎక్కువగా బెట్టింగులు జరుగుతున్నాయి. మరోవైపు ఏపీ సరిహద్దు జిల్లాల్లోని మున్సిపాలిటీలపై ఏపీకి చెందినవారు బెట్టింగులు కడ్తున్నారు.బెట్టింగ్ ముఠాలు యూత్ను టార్గెట్ చేసినట్టు తెలిసింది. ఐదు వేలు, పది వేలు బెట్టింగ్ కడితే.. కొద్దిరోజుల్లోనే రెండు మూడింతలు వస్తుందంటూ గాలం వేస్తున్నట్టు సమాచారం. దీంతో చాలా మంది యూత్ తమకు నచ్చినట్టుగా పందాలు కాస్తున్నారు. భారీగా డబ్బు వస్తుందన్న ఆశతో కొందరు మధ్యతరగతి వాళ్లు అప్పులు చేసి మరీ బెట్టింగ్లు కడుతున్నారు.

Related Posts