YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 జనసేనకు ఇక రెండు వర్గాలు దురమే

 జనసేనకు ఇక రెండు వర్గాలు దురమే

 జనసేనకు ఇక రెండు వర్గాలు దురమే
విజయవాడ, జనవరి 20
ఏపీ లోని రెండు పార్టీలపై విరక్తితో పాటు పవర్ స్టార్ పై వున్న అభిమానం, ప్రేమ మైనారిటీలను అధిక సంఖ్యలో జనసేన లో చేరేలా చేసింది. ఒక బలమైన శక్తిగా ఎపి రాజకీయాల్లో పవన్ ఎదో ఒక రోజు అవతరిస్తారని చిరంజీవిలా ఆయన తన పార్టీని విలీనం చేసే రకం కాదని వారంతా నమ్మారు. ఎప్పటినుంచో తాము నమ్ముకున్న సెక్యులర్ పార్టీకి ఏపీ లో మనుగడ లేక పోవడంతో జనసేనే తమకు సెక్యూరిటీ అని భావించారు. పదవులు, సీట్లు ఇవ్వకపోయినా తమ గొంతుకను ఆయనే వినిపిస్తారని విశ్వసించారు. మరీ ముఖ్యంగా తెలుగు వారి ఆత్మాభిమానం తాకట్టు పెట్టే పనులు తాను చేయబోనని చస్తే చస్తాం కానీ బిజెపి తో జతకట్టకట్టమని ప్రజల సాక్షిగా బహిరంగ వేదికపై ప్రకటించి ఆ వర్గాన్ని మరింతగా జనసేనాని ఆకట్టుకున్నారు. మతాల్ని, కులాలను కలిపే రాజకీయం జనసేన సిద్ధాంతం అంటూ ప్రకటించి వారి మనసులు గెలుచుకున్నారు పవన్.పవన్ కళ్యాణ్ అమరావతి లోనే క్యాపిటల్ ఉండాలనే డిమాండ్ తో బిజెపి అధిష్టానాన్ని కలుస్తారని అనుకున్నారు ఆ పార్టీలోని మైనారిటీ నేతలు, క్యాడర్. అయితే ఆయన కమలంతో పొత్తుతో సీన్ కట్ చేయడాన్ని వారు ఇప్పుడు జీర్ణించుకోలేక షాక్ తిని ఆ తరువాత పార్టీకి గుడ్ బై కొట్టేస్తున్నారు. ఈ మేరకు పలువురు మైనారిటీ జనసేన నాయకులు సోషల్ మీడియా పోస్ట్ లలో ఎంతో ఆవేదనతో తమ బాధను మిత్రులతో పంచుకుంటున్నారు. మరీ ముఖ్యంగా పౌరసత్వ సవరణ బిల్లుకు మద్దత్తుగా పవన్ ప్రసంగించడాన్నిదాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మైనారిటీలు తట్టుకోలేక పోతున్నారు. మొన్నటి ఎన్నికల్లో పవన్ సిద్ధాంతాలు నచ్చి పక్కపార్టీలు పైసలు ఇస్తున్నా తీసుకోకుండా జనసేన విజయానికి శ్రమించామని ఆయన పార్టీలో ఎలాంటి విస్తృత చర్చ జరపకుండా ఇలా తమ మనోభావాలను పరిగణలోనికి తీసుకోకుండా కాషాయం కప్పేసుకోవడం ఏమిటన్నది వారి ప్రశ్నగా మిగిలింది.పవన్ కళ్యాణ్ స్థానిక ఎన్నికలు లేదా అమరావతి లో రాజధాని అంశంపై టిడిపి తో పొత్తు పెట్టుకుని లాభ పడాలని పార్టీ సమావేశాల్లో సూచించామని మరికొందరు సోషల్ మీడియా లో వాపోతున్నారు. టిడిపి తో కలిసి ప్రయాణం చేస్తే క్షేత్ర స్థాయిలో బలమైన క్యాడర్ రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీకి ఉన్నందున చాలా సీట్లలో విజయం సాధించేవారమని తమ పార్టీ క్రమంగా బలపడే అవకాశాలు వుండేవన్నది వారి బాధగా కనిపిస్తుంది. అయితే జనసేన క్యాడర్ చెప్పింది ఒకటి అయితే పవన్ చేసింది మరొకటి అని మరికొందరు విమర్శలు సైతం మొదలు పెట్టేశారు.సామాజిక మాధ్యమాల్లో పార్టీలోని మైనారిటీ కార్యకర్తల పోస్టింగ్ లపై జనసేన లో వున్న మిత్రులు పెద్ద ఎత్తునే వాదనలతో చర్చ నిరంతరం కొనసాగుతుంది. అయితే ఇప్పుడు తన నిర్ణయాలను దిద్దుకునే అవకాశం జనసేనానికి లేకపోవడంతో అయితే టిడిపి లేకపోతే వైసిపి తో జనసేన మైనారిటీ సైనికులు సాగేలాగే వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఇలాంటి సమయాల్లో పోయే వారు పోతారని ఉండేవారు ఉంటారని మైనారిటీల ఓటు బ్యాంక్ హిందూ ఓటు బ్యాంక్ తో భర్తీ చేసుకోవచ్చన్నది ఆ పార్టీలో కొందరి వాదన. అయితే హిందూ ఓటు బ్యాంక్ పక్కాగా బిజెపి వైపు ఉండగా జనసేనకు వచ్చే లాభం ఏమిటన్నది మైనారిటీల సందేహంగా చర్చ రచ్చ సాగుతుంది.

Related Posts