YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ముగిసిన ప్రచారం... ఎన్నికలే తరువాయి

ముగిసిన ప్రచారం... ఎన్నికలే తరువాయి

ముగిసిన ప్రచారం... ఎన్నికలే తరువాయి
హైదరాబాద్ జనవరి 20
మున్సిపల్ ఎన్నికలు అందరి నోటా ఇదే మాట...ఇప్పటివరకు ప్రచారం తో హోరెత్తించారు అన్ని పార్టీల నాయకులు.తమ బలాలను ప్రజల్లోకి తీసుకెళ్లి తమను గెలిపించాలని కోరారు.టీఆరెస్ పార్టీ జిల్లాల వారిగా మంత్రులు ప్రచారం లోకి వచ్చి టీఆరెస్ పార్టీ పథకాలను ప్రజల్లోకి వెళ్లారు.కాంగ్రెస్ సైతం ప్రచారం లో దూసుకెళ్లిన ఒకరిద్దరూ మినహా మిగతా పెద్ద నాయకులు అంత తమ నియోజకవర్గ పరిధికి మాత్రమే పరిమితం అయ్యారు.ఇక పార్లమెంట్ ఎన్నికలలో పుంజుకున్న బీజేపీ  మున్సిపల్ ఎన్నికల లో సత్తా చాటేందుకు సిద్ధం అయింది.కొన్ని ప్రాంతాల్లో అభ్యర్థులు కూడా లేని స్థితిలో కాంగ్రెస్, బీజేపీలు ఉంటే.. రెబల్స్ గొడవ టీఆరెస్ కి తలనొప్పి ని తెచ్చిపెట్టాయి.మరి కొన్ని చోట్ల అధికార టీఆరెస్ పార్టీ అభ్యర్థులను పోటీ లేకుండానే ఎన్నుకున్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో టీఆరెస్ పార్టీ ప్రచారం లో అందరికన్నా ముందు ఉంది.జిల్లాల వారిగా,మంత్రులు, ఎమ్మెల్యే ల వారిగా తమతమ పరిధిలో ప్రచారం లో దూసుకెళ్లారు.అధికారం లో టీఆరెస్ పార్టీ ఉండడం వీరికి కలిసొచ్చే అంశం.మంత్రుల నియోజకవర్గల వారిగా నాయకుణ్ణి నియమించి వారికి బాధ్యతలు అప్పగించక ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారు నాయకులు,టీఆరెస్ పార్టీ సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని వారి ధీమా.దీనితో పాటు మంత్రులు అంత ప్రచారంలో పథకాలను,జరుగుతున్న అభివృద్ధి ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. పైగా అందరు నాయకులకు పట్టు ఉన్న ప్రాంతాలు కావడం తో మళ్ళీ అత్యధిక మెజార్టీతో మున్సిపల్ లో నిలబడతాం అని వారి నమ్మకం గా చెవుతున్నారు.దీనితో పాటు కొత్త మున్సిపల్ చట్టం కలిగే ప్రయోజనాలని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగం అని నాయకులు అంటున్నారు.స్థానిక ఎన్నికల పోరులో నిలబడేందుకు ఎంతటి ఖర్చుకైనా వెనకడడం లేదు నాయకులు.దీనితో మా ప్రచారం కేవలం నామమాత్రమే గెలుపు తమదే అని టీఆరెస్ అంటుంది.
ఇక బీజేపీ మాత్రం సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో ఒక్కసారిగా పుంజుకుంది.ఆ ఫలితాలు ఇచ్చిన రెట్టింపు ఉత్సాహంతో బీజేపీ అధినాయకత్వం కూడా తెలంగాణ పై ఫోకస్ చేసి పార్టీ బలోపేతానికి ప్రత్యేకంగా దృష్టి సారించిందిఅసెంబ్లీ ఎన్నికల్లో.టి ఆర్ ఎస్ ప్రభంజనానికి చావు దెబ్బ తిన్న కమలం పార్టీ..సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో  ఉపశమనం పొందటమే కాదు..ఫుల్ జోష్ తో దూసుకుపోతుంది.ఎన్నడూ లేనంతా జోష్ తో ముందుకు వెళ్తోంది.దానికి కారణం నాలుగు ఎంపీ స్థానాల్లో గెలుపొందటమే కాదు ముఖ్యమంత్రి కుమార్తె తో పాటు టిఆర్ ఎస్ లోక్ సభ పక్ష నాయకున్ని ఓడించటం ఆ పార్టీ మైలేజీని మరింత పెంచింది.సరిగ్గా ఈ సమయంలో వచ్చిన మున్సిపాలిటీ ఎన్నికలు కమలం పార్టీ కి తన సత్తా ఏంటో నిరూపించుకోక తప్పక పరిస్థితిని తెచ్చిపెట్టాయి.ముఖ్యంగా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ లోక్సభ సెగ్మెంట్ల పరిధిలో ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు చాలా కీలకమైనవి. రాష్ట్ర రాజకీయాలపై ఇవి ప్రభావం చూపెట్టే అవకాశం ఉన్నవి.ప్రచారం లో భాగంగా బీజేపీ స్టార్ క్యాంపేయినర్లు రంగంలోకి దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు , రోడ్ షోలు, సమావేశాలతో ప్రచారం హోరెత్తించారు. అదికార టీఆర్ఎస్ పై మాట తూటాలు పేలుస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసార్రు. కేంద్ర పథకాలు, స్థానిక సమస్యలే టార్గెట్ గా ప్రచారం లో దూసుకు వెళ్లారు  బీజేపీ నేతలు.
15 క్లస్టర్లను ఏర్పాటు చేసి రాష్ట్ర స్థాయి నేతలను ఇన్చార్జ్ లుగా నియమించింది. దీనికి తోడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  సింగరేణి పరిదిలో ప్రచారం,బీజేపీ అద్యక్షులు లక్ష్మన్ మహబూబ్ నగర్ లో మునిసిపల్ ఎన్నికల ప్రచారం..బీజేపీతోనే మునిసిపాలిటీల అభివృద్ది సాధ్యం అని .. రాష్ట్ర ప్రభుత్వం మునిసిపాలిటీలను పూర్తిగా బ్రష్టు పట్టించ్చిందని .. కేంధ్ర మ్రభుత్వం నిదులు తప్పితే రాష్ట్ర ప్రభుత్వం మునిసిపాలిటీలకు చేసిందేమీ లేదని ఆరోపనలతో బీజేపీ ప్రజల్లోకి వెళ్ళింది... ఎమ్మెల్యే రాజా సింగ్ నల్లగొండ జిల్లాలో ప్రచారం,జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావ్  ఆధ్వర్యంలో చేపట్టిన ప్రచార కార్యక్రమం తో పాటు,ఎంపీలు బండి సంజయ్ ,అరవింద్, సోయం బాపూరావ్, డీకే అరుణ, వివేక్ , గరిక పాటి, పెద్దిరెడ్డి, ఇంద్రసేనా రెడ్డి ఇలా అనేక మంది ముఖ్యనేతలు  వారి ఎంపీ క్లస్టర్ లలో ప్రచారం చేశారు. ఎవరికి వారు తమ ప్రచారలలో అధికార పార్టీ తప్పులను ప్రజల్లోకి తీసుకెళ్లింది.దీంతో బీజేపీ మునిసిపల్ ఎన్నికల ప్రచారం గొప్పగా సాగిందని ఆపార్టీ నాయకులు అంటున్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ ,బీజేపి ముఖ్యనాయుకులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తుంటే..కాంగ్రెస్ నాయకుల ప్రచారం మాత్రం డిపరెంట్గా ఉంది..స్టేట్ వైడ్ గా పేరున్నకాంగ్రెస్ ఎంపీలు సైతం ప్రచారం వారి పార్లమెంట్ నియోజకవర్గాలు దాటి రావడం లేదు.
ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన పోటీ మూడు పార్టీల మధ్యే ఉందనే ఉండనుంది.మున్సిపల్ ఎన్నికల్లో  ప్రచారంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు దూసుకోతుంటే..కాంగ్రెస్ నాయకులు మాత్రం వారి నియోజకవర్గాల ప్రచారినికే పరిమితం అవుతన్నారు..కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ ఎన్నికల హామీలతో పాటు కేంద్రంలోని బిజెపి అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలే ప్రధాన ప్రచార ఎజెండాగా ముందుకు వెళ్లాలని పార్టీ నిర్ణయించింది. ముఖ్య నేతలు ఎవరి నియోజకవర్గాల పరిధిలో వారు బాధ్యతలు తీసుకొని ప్రచారం చేయాలని పార్టీ నిర్ణయించింది. డిసిసి అధ్యక్షులు ,ఆఫీస్ బేరర్లు , పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యులు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులందరూ ఆయా మున్సిపాలిటీ  కార్పొరేషన్ ప్రచారంలో ప్రచారంలో పాల్గొన్నారు.నల్గొండ పార్లమెంట్ పరిధిలోని  12 మున్సిపాలిటీల్లో నిర్వహించే ప్రచార కార్యక్రమాల్లో ఎంపీ, పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రచారం చేషారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన నియోజకవర్గ పరిధిలోని 15 మున్సిపాలిటీల్లో ప్రచారం మునిగితెలుతున్నారు.మరొక ఎంపీ, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మల్కాజగిరి  నియోజకవర్గంలోని 9 మున్సిపాలిటీలు నాలుగు కార్పొరేషన్లలో పార్టీ అభ్యర్థులు గెలుపు బాధ్యతలు తీసుకుని ప్రచారంలో దూసుకుపోతున్నారు.ఈ మునిసిపల్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలుస్తామంటూ దీమా వ్యక్తం చేస్తున్నారు.మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్కి ఉన్న ముగ్గురు ఎంపీలని వారి నియోకవర్గాల ప్రచారానికే పరిమితం చేయడం పట్ల కార్యకర్తలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.స్టేట్ వైడ్ పేరున్నఅ ముగ్గురు ఎంపీలు అన్న మునిసిపాలటీలో ప్రచారం చేసి కాంగ్రెస్ అభ్యర్ధులని గెలిపించాలి తప్ప వారి నియోకవర్గాలకే పిరిమితం కావడం ఎంటని ప్రశ్నిస్తున్నారు.అనుకున్నది ఒకటి ఐనది ఒకటి లా ఉంది కాంగ్రెస్ పరిస్థితి. దీనితో కాంగ్రెస్ ప్రచారం లో డీలపడిందనే అంటున్నారు కార్యకర్తలు.

Related Posts