YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఏకగ్రీవ ఎన్నిక

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఏకగ్రీవ ఎన్నిక

 బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఏకగ్రీవ ఎన్నిక
న్యూఢిల్లీ జనవరి 20 
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఆ పార్టీ సీనియర్‌ నేత, జేపీ నడ్డా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ సీనియర్‌ నాయకులు, కేంద్ర మంత్రులు, పార్టీ అధికారంలో ఉన్న రాష్ర్టాలకు చెందిన మంత్రులు పార్టీ జాతీయాధ్యక్షుడిగా నడ్డాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నడ్డా పార్టీ నూతన జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు బీజేపీ ఎన్నికల ఇంచార్జి రాధా మోహన్‌సింగ్‌ ఈ సందర్భంగా నియామక పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా నడ్డాకు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అభినందనలు తెలిపారు. ప్రస్తుతం నడ్డా బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా విధుల్ని నిర్వహిస్తున్నారు.విద్యార్థి దశ నుంచే బీజేపీ రాజకీయ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్న నడ్డాకు మచ్చలేని నేతగా ఆ పార్టీలో మంచి పేరుంది. ఈ పదవికి ఆయనే సరైన వ్యక్తి అని ప్రధాని మోదీ, హోంమంత్రి, ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు అమిత్‌ షా భావించడంతో ఆయన ఎన్నిక దాదాపు ఖరారైనైట్టెంది. బీజేపీ జాతీయాధ్యక్షుడిగా గత ఐదున్నరేండ్లుగా అమిత్‌ షా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించి.. బీజేపీ నేతృత్వంలో ఏర్పడిన మోదీ 2.0 ప్రభుత్వంలో ఆయనకు హోంశాఖ దక్కింది. ‘ఒక వ్యక్తి, ఒక పదవి’ సంప్రదాయాన్ని బీజేపీ ప్రారంభించడంతో అమిత్‌ షా ప్రస్తుతం నిర్వహిస్తున్న జాతీయాధ్యక్షుడి పదవికి కొత్త వ్యక్తిని తీసుకోవడం అనివార్యమైంది.

Related Posts