YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

సారాపై ఉక్కుపాదం

సారాపై ఉక్కుపాదం

సారాపై ఉక్కుపాదం
అనంతపురం జనవరి 20 
జిల్లాలో అక్రమ మద్యంపై పోలీసులు ప్రత్యేక నిఘా వేశారు. జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు ఆదేశాలుతో ఆది, సోమ వారాల్లో విస్తృత దాడులు చేపట్టారు. జిల్లావ్యాప్తంగా నాటు స్థావరాలు, బెల్టు దుకాణాలు, అక్రమ మద్యం విక్రయాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. అన్ని సబ్ డివిజన్ల పరిధుల్లో తనిఖీలు కొనసాగాయి. డీఎస్పీలు, సి.ఐ లు, ఎస్ ఐ లు, స్థానిక సిబ్బంది మరియు జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ నుండీ వాహనాలు, స్పెషల్ పార్టీ అధికారులు, సిబ్బంది, బృందాలుగా వెళ్లి గ్రామాల్లో, తండాల్లో మరియు అటవీ ప్రాంతాల్లో జల్లెడపట్టారు. ప్రధానంగా అనంతపురం, కదిరి, కళ్యాణదుర్గం, పెనుకొండ, తాడిపత్రి, ధర్మవరం, గుంతకల్లు సబ్ డివిజన్లలోని నాటు సారా స్థావరాలపై దాడులు చేశారు. జిల్లా అంతటా ఈరెండ్రోజుల్లో మొత్తం 17 మందిని అరెస్టు చేశారు. నాటు సారా తయారీకి కుండలు, డ్రమ్ములలో సిద్ధం చేసుకున్న 4,550 లీటర్ల నాటు సారా ఊటను ధ్వంసం చేశారు. 106 లీటర్ల నాటు సారా, 181 నాటు సారా ప్యాకెట్లు మరియు అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వారి నుండీ 249 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల సందర్భంగా పరారయిన నాటు సారా బట్టీల నిర్వాహకులు, తయారీదారులపై ఆరా తీస్తున్నారు. త్వరలోనే వీరిని కూడా అరెస్టు చేయనున్నారు. అక్రమ మద్యం విక్రయాలు, రవాణా మరియు నాటు సారా స్థావరాల నియంత్రణకు మున్ముందు కూడా స్పెషల్ డ్రైవ్ లు చేపట్టి గట్టి చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు అన్నారు. 

Related Posts