YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు దేశీయం

నిర్భయ కేసులో పవన్ పిటీషన్ కొట్టివేత

నిర్భయ కేసులో పవన్ పిటీషన్ కొట్టివేత

నిర్భయ కేసులో పవన్ పిటీషన్ కొట్టివేత
న్యూఢిల్లీ, జనవరి 20,
నిర్భయ కేసులో నలుగురు దోషుల్లో ఒకడైన పవన్‌ కుమార్‌ గుప్తా పిటిషన్‌ సుప్రీం కోర్టు కొట్టివేసింది. నిర్భయ ఘటన సమయంలో తాను మైనర్‌ అని పవన్‌ పిటిషన్‌ దాఖలు చేశాడు. ఇప్పటికే పవన్‌ పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు కొట్టివేసింది. నిర్భయ దోషులకు ఢిల్లీ కోర్టు డెత్‌ వారెంట్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఫిభ్రవరి 1వ తేదీ ఉదయం 6 గంటలకు దోషులకు ఉరిశిక్ష అమలు పరచాల్సిందిగా డెత్‌ వారెంట్‌లో పేర్కొంది.ఘటన సమయంలో పవన్‌ మైనర్‌ అని, అతని స్కూల్‌ సర్టిఫికెట్‌లో కూడా అతడు మైనర్‌ అని చెప్పడానికి ఆధారాలున్నాయని దోషి తరపు న్యాయవాది ఏపీ సింగ్‌ కోర్టుకు తెలిపారు. ఢిల్లీ హైకోర్టు ఈ విషయాన్ని పరిగణించలేదని ఏపీ సింగ్‌ సుప్రీం కోర్టుకు వెల్లడించారు. ఐతే పవన్‌ గుప్తా మైనర్‌ కాదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. కాలయాపన కోసమే పిటిషన్‌ వేశారని కోర్టు పేర్కొంది. ఒకే అంశంపై మళ్లీ మళ్లీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయరాదని, పిటిషన్‌ విచారణకు అర్హత లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. పవన్‌ గుప్తా తరఫు న్యాయవాదిని కోర్టు మందలించింది.

Related Posts