YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మమ్మల్ని కాల్చి చంపేయండి సార్

మమ్మల్ని కాల్చి చంపేయండి సార్

మమ్మల్ని కాల్చి చంపేయండి సార్
విజయవాడ, జనవరి 20, 
మూడు రాజధానులపై రాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వం వికేంద్రీకరణ బిల్లు ప్రవేశపెట్టి చర్చ చేపట్టిన నేపథ్యంలో రాజధాని రైతులు ఆందోళనలు ముమ్మరం చేశారు. తమ ఇళ్ల నుంచి అసెంబ్లీ వైపు పరుగులు పెడుతున్నారు. జాతీయ జెండాలు, నల్ల జెండాలు పట్టుకుని నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఎలాంటి ఆందోళనలకు అనుమతులు లేవని పోలీసులు చెబుతున్నా రైతులు మాత్రం వెరవడం లేదు. తమ త్యాగాలను గుర్తించాలని రైతులు వేడుకుంటున్నారు.నిరసన ప్రదర్శన చేస్తున్న ఓ రైతు పోలీసు అధికారితో మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. నిరసన చెప్పేందుకు కూడా ఈ ఆంక్షలు ఏంటని పోలీసు ఉన్నతాధికారిని రైతు ప్రశ్నించారు. ‘మమ్మల్ని కాల్చేయండి సార్‌.. చచ్చిపోతాం.. నిరసన తెలిపే హక్కు కూడా లేదా’ అంటూ ఓ రాజధాని రైతు తన ఆగ్రహావేశాన్ని వ్యక్తం చేశారు. ‘‘ఈ జెండా వల్ల ఎవరికి నష్టం ఉంది సర్.. అడుక్కుతినేందుకు రోడ్డు మీద పడ్డాం. నిరసన కూడా చెప్పనివ్వకపోతే.. మమ్మల్ని కాల్చేయండి సర్.. చచ్చిపోతాం. ఇంతకన్నా ముము ఇంకేం చేయగలం. భూదేవి తల్లిని వదిలిపెట్టాం..’’ అంటూ ఓ రాజధాని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా పోలీసు అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేయడంతో.. ‘‘నిరసన తెలిపేందుకు హక్కు లేకుండా.. ఏంటండీ ఈ అమానుషం’’ అంటూ అక్కడి నుంచి భారంగా వెనుదిరిగారు.అలాగే అమరావతే రాజధానిగా ఉండాలని కోరుతూ.. సీఎం జగన్‌, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజధాని రైతులు నినాదాలు చేస్తున్నారు. రాజధాని గ్రామాల్లోని పలు వీధుల్లో పోలీసులు కవాతు చేస్తూ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా వలలను కూడా ఏర్పాటు చేస్తూ ఇంటి ముందు నిలబడుతున్నారు. ఈ నేపథ్యంలో వెలగపూడిలో కుటుంబంతో కలిసి నిరసనల్లో పాల్గొంటున్న ఓ ఇంజినీరింగ్‌ విద్యార్థిని ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. పోలీసులు నిర్దాక్షిణ్యంగా వ్యవహరించడమే ఇందుకు కారణమంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related Posts