YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

కొలిక్కిరాని కర్నాటకం

కొలిక్కిరాని కర్నాటకం

కొలిక్కిరాని కర్నాటకం
బెంగళూర్, జనవరి 21 
కర్ణాటక మంత్రి వర్గ విస్తరణ తేదీ ఖరారు కాలేదు. మరోవైపు ముఖ్యమంత్రి యడ్యూరప్ప దావోస్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. దీంతో ఆయన వచ్చిన తర్వాతనే మంత్రి వర్గ విస్తరణ జరగనుంది. కర్ణాటక పర్యటనకు వచ్చిన అమిత్ షాతో ముఖ్యమంత్రి యడ్యూరప్ప మంత్రి వర్గ విస్తరణపై చర్చలు జరిపారు. అయినా దానిపై ఇంకా క్లారిటీ రాలేదని తెలుస్తోంది. రాజీనామాలు చేసి అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలు తిరిగి ఉప ఎన్నికల్లో గెలవడంతో వారికి మంత్రి పదవులు ఇవ్వాలని యడ్యూరప్ప గట్టిగా పట్టుబడుతున్నారు.ఉప ఎన్నికలు జరిగి నెలన్నర కావస్తున్నప్పటికీ ఇంకా మంత్రివర్గ విస్తరణ జరగలేదు. ఇందుకు అధిష్టానం నుంచి సరైన సహకారం లేకపోవడమే. ఇందుకు ప్రధాన కారణం ఎన్నికల ప్రచారంలో రాజీనామాలు చేసి అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలందరికీ మంత్రి పదవులు ఇస్తామని యడ్యూరప్ప హామీ ఇవ్వడమే. బీజేపీ ప్రభుత్వం ఏర్పడటానికి వారు చేసిన త్యాగాలను గుర్తించాలని అమిత్ షాను యడ్యూరప్ప పదే పదే కోరినట్లు తెలిసింది.అయితే అందరికీ మంత్రి పదవులు ఇవ్వడం సాధ్యకాదని అమిత్ షా తేల్చినట్లు తెలుస్తోంది. ముఖ్యమైన నేతలకు మాత్రమే మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉంటుందని, అలాగే బీజేపీలో తొలి నుంచి ఉన్న సీనియర్ నేతలకు కూడా మంత్రి వర్గ విస్తరణలో ప్రాధాన్యం ఇవ్వాల్సిందేనని అమిత్ షా అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. దానివల్ల పార్టీలోనూ అసంతృప్తి చెలరేగితే ఏం చేయగలరని యడ్యూరప్పను అమిత్ షా నిలదీసినట్లు సమాచారందీంతో మొత్తం మీద మంత్రి వర్గ విస్తరణకు అయితే యడ్యూరప్ప గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తొలిదశలో కేవలం పదకొండు మాత్రమే అవకాశమివ్వాలని యడ్యూరప్పకు అమిత్ షా సూచించినట్లు తెలిసింది. దీంతో పాటు బీజేపీ సీనియర్ నేతలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. రాష‌్ట్ర పార్టీ నాయకత్వంతో మాట్లాడి జాబితాను సిద్ధం చేయాలని కూడా అమిత్ షా ఆదేశించినట్లు తెలుస్తోంది. అయితే యడ్యూరప్ప దావోస్ పర్యటనను ముగించుకుని వచ్చిన తర్వాతనే మంత్రి వర్గ విస్తరణ జరిగే అవకాశాలున్నాయి.

Related Posts