YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

బిల్లును అడ్డుకున్న విపక్షాలు

బిల్లును అడ్డుకున్న విపక్షాలు

బిల్లును అడ్డుకున్న విపక్షాలు
అమరావతి జనవరి 21, 
ఏపీ శాసన మండలిలో వికేంద్రీకరణ బిల్లును ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ప్రవేశపెట్టగా తెదేపా అడ్డుకుంది. వికేంద్రీకరణ బిల్లును వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ  రూల్ 71 మోషన్ కింద నోటీసు ఇచ్చింది. రూల్ 71 కింద చర్చ జరపాలని ఏపీ శాసనమండలి ఛైర్మన్ నిర్ణయించారు. ఏవిధంగా చర్చ జరపాలన్న అంశంపై చాంబర్ లో మాట్లాడదామని ఛైర్మన్ షరీఫ్ తెలిపారు. మండలి ఛైర్మన్ భయపడుతున్నారని అధికారపక్ష సభ్యులు అన్నారు. భయపడటానికి ఇదేం గుడివాడ కాదని  మండలిలో ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు అన్నారు. బిల్లులు ప్రవేశపెట్టే ముందు తామిచ్చిన నోటీసుపై చర్చ జరపాలని యనమల  డిమాండ్ చేశారు. శాసనమండలిని కించపరిచే విధంగా మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలు చేశారనే విషయాన్ని ప్రస్తావించిన యనమల.. మండలికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మండలి సభ్యులకు ఎందుకు ఫోన్లు చేస్తున్నారని ప్రశ్నించారు. వికేంద్రీకరణ బిల్లు అసెంబ్లీ ఆమోదం పొందినందున చర్చ జరగాల్సిందేనని మంత్రి బుగ్గన స్పష్టం చేశారు. రూల్ 71 కింద బిల్లును తిరస్కరించే అధికారం మండలికి లేదని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన మండలి ఛైర్మన్ ... రూల్ 71 నోటీసుపై చర్చకు అనుమతిచ్చారు. దీంతో మండలిలో వికేంద్రీకరణ బిల్లుకు తాత్కాలికంగా అడ్డుకట్ట పడింది. 

Related Posts