YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 దోచుకో..

 దోచుకో..

 దోచుకో.. (అనంతపురం)
అనంతపురం, జనవరి 21 : జిల్లాలో ఖనిజ అక్రమ తవ్వకాలు, రవాణా మితిమీరుతోంది. ఓవైపు ప్రభుత్వ అనుమతి లేకుండా తవ్వకాలు చేపడుతున్నారు. మరోవైపు రాయల్టీ చెల్లించకుండా ఎంచక్కా తరలించేస్తున్నారు. ఎంతో విలువైన ఖనిజం జిల్లా సరిహద్దులు దాటుతోంది. ఇంత జరుగుతున్నా.. అధికారులు గట్టిచర్యలు తీసుకోవడం లేదు. నామమాత్రంగా తనిఖీలు నిర్వహించి చేతులు దులుపుకొంటున్నారు. రూ.లక్షలు విలువ చేసే ఖనిజం కన్నుగప్పి హద్దులు దాటుతున్నా చర్యలు శూన్యం. సాధారణంగా ఎలాంటి ఖనిజాన్ని తవ్వాలన్నా, రవాణా చేయాలన్నా గనులు, భూగర్భశాఖ అనుమతులు తప్పనిసరి. అలాగే గనుల నుంచి తరలించే ఖనిజానికి ప్రభుత్వానికి క్యూబిక్‌మీటర్ల చొప్పున రాయల్టీ చెల్లించాలి. ఈ నిబంధనలను పాటించకపోతే అది అక్రమమే అవుతుంది. జిల్లాలో గ్రానైట్‌, స్టియటైట్‌, సున్నపురాయి వంటి ఖనిజాలు స్థానికంగానే కాకుండా ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. కంకర స్థానిక నిర్మాణాలకు ఉపయోగిస్తున్నారు. కంకరకు డిమాండ్‌ ఉండటంతో జిల్లాలో పెద్ద సంఖ్యలో గనులు వెలిశాయి. ఇష్టారాజ్యంగా కంకరను జిల్లా సరిహద్దులు దాటించేస్తున్నారు. ప్రధానంగా బొమ్మనహాళ్‌, డి.హీరేహాళ్‌, సోమందేపల్లి, పరిగి, కుందుర్పి తదితర ప్రాంతాల నుంచి కంకరను రాయల్టీ చెల్లించకుండా రవాణా చేస్తున్నారు. ఫలితంగా రూ.లక్షల్లో ప్రభుత్వానికి గండి పడుతోంది. గ్రానైట్‌ పరిశ్రమలు తాడిపత్రిలో అధికంగా ఉన్నాయి. జిల్లా నుంచే కాకుండా కర్నూలు, ప్రకాశం జిల్లాల నుంచి ముడి ఖనిజం వస్తుంది. గనుల నుంచి పాలిషింగ్‌ ఫ్యాక్టరీలకు తరలించే గ్రానైట్‌కు సీనరేజి చెల్లించకుండా రవాణా చేస్తున్నారు. ఒకవేళ చెల్లించినా.. తక్కువ పర్మిట్లు తీసుకుని, ఎక్కువ పరిమాణం ఉన్న గ్రానైట్‌ను తరలిస్తున్నారు. రోజుకు పదుల సంఖ్యలో గ్రానైట్‌ లారీలు అక్రమ రవాణా సాగిస్తున్నా.. ఒకట్రెండు మాత్రమే పట్టుబడుతున్నాయి. చిలమత్తూరు, తనకల్లు, మడకశిర, అగళి ప్రాంతాల నుంచి బెంగళూరుకు గ్రానైట్‌ గుండ్లను బిల్లులు లేకుండా రవాణా చేస్తున్నారు. జిల్లాలో గ్రావెల్‌కి అధిక డిమాండ్‌ ఉంది. రోడ్లు, భవనాలు, టవర్లు, వెంచర్ల నిర్మాణానికి ఎర్రమట్టి చాలా అవసరం. ప్రభుత్వ ఆధీనంలో ఉండే చిన్నపాటి దిబ్బలు, అసైన్ట్‌భూముల్లో మట్టి లభ్యమవుతుంది. అధికంగా మట్టి అవసరముంటే తప్పనిసరిగా గనులు, భూగర్భశాఖ అధికారులతో అనుమతి పొందాలి. నిర్ణయించిన సీనరేజీ చెల్లించి రవాణా చేసుకోవచ్ఛు కొందరు అక్రమార్కులు ప్రభుత్వ భూముల్లో ఎక్కడపడితే అక్కడ జేసీబీలతో గ్రావెల్‌ను తవ్వి సొమ్ము చేసుకుంటున్నారు.
జిల్లాలో ఇప్పటికే విజిలెన్స్‌, గనుల శాఖ సిబ్బంది దాడులు నిర్వహించి అక్రమ గ్రానైట్‌, కంకర రవాణాను అడ్డుకుంటున్నట్లు అధికారులు చెప్తున్నా.., పలుచోట్ల జిల్లా సరిహద్దులు దాటే అవకాశం ఉంది. అలాంటి చోట గట్టినిఘా ఉంచినట్లు గనుల శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో ఏర్పాటవుతున్న చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటామన్నారు.

Related Posts