YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 మండలిలో వైసీపీకి ఇబ్బందులు

 మండలిలో వైసీపీకి ఇబ్బందులు

 మండలిలో వైసీపీకి ఇబ్బందులు
విజయవాడ, జనవరి 21
రాష్ట్ర శాసన మండలిలో వైసీపీ ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. మండలి వైసీపీకి సంఖ్యాబలం లేనందున మూడు రాజధానుల బిల్లులు పాస్ చేయించుకోవడం కత్తిమీద సాముగా మారింది. ఇప్పటికే రాష్ట్ర అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లులు ఆమోదం పొందగా, మండలిలో మాత్రం అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ సందర్భంగా టీడీపీ అనూహ్యంగా రూల్ 71 మోషన్ కింద నోటీసు ఇచ్చింది. దీంతో వైసీపీ ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి.మండలిలో వికేంద్రీకరణ బిల్లును ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రవేశపెట్టగా టీడీపీ అడ్డుకుంది. వికేంద్రీకరణ బిల్లును వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ రూల్‌ 71 మోషన్‌ కింద నోటీసు ఇచ్చింది. బిల్లులు ప్రవేశపెట్టే ముందు తామిచ్చిన నోటీసుపై చర్చ జరపాలని మండలిలో ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు డిమాండ్‌ చేశారు. అలాగే టీడీపీ మండలి సభ్యులకు ఎందుకు ఫోన్లు చేస్తున్నారని ప్రశ్నించారు.అయితే వికేంద్రీకరణ బిల్లు అసెంబ్లీ ఆమోదం పొందినందున చర్చ జరగాల్సిందేనని మంత్రి బుగ్గన స్పష్టం చేశారు. రూల్‌ 71 కింద బిల్లును తిరస్కరించే అధికారం మండలికి లేదన్నారు. ఈ నేపథ్యంలో మండలి చైర్మన్‌ షరీఫ్ రూల్ 71 నోటీసుపై చర్చకు అనుమతిచ్చారు. దీంతో మండలిలో వికేంద్రీకరణ బిల్లుకు తాత్కాలికంగా అడ్డుకట్ట పడింది.అయితే బిల్లులపై చర్చ జరగకుంటే మండలిని రద్దు చేసే యోజనలో ప్రభుత్వం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై ఇప్పటికే ప్రభుత్వ పెద్దలు తీవ్రంగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. మండలిలో ఇబ్బందులు లేకుండా చూసుకునేందుకు కొందరు మంత్రులు సైతం రంగంలోకి దిగారు. మండలి రద్దు వార్తల నేపథ్యంలో మంత్రి లోకేశ్ స్పందించారు. మండలిని కనుక రద్దు చేస్తే అంతకంటే అప్రజాస్వామ్యం మరొకటి ఉందని చెప్పారు.
మండలిలో పార్టీల బలాబలాలు..
మొత్తం ఎమ్మెల్సీలు : 58
టీడీపీ: 34, వైసీపీ: 09, పీడీఎఫ్‌: 06, స్వతంత్రులు: 03, బీజేపీ: 02, కాంగ్రెస్: 01, ఖాళీలు: 03

Related Posts