YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఆసక్తిగా మారిన అసెంబ్లీ  పరిణామాలు

ఆసక్తిగా మారిన అసెంబ్లీ  పరిణామాలు

ఆసక్తిగా మారిన అసెంబ్లీ  పరిణామాలు
విజయవాడ, జనవరి 21
ఏపీ అసెంబ్లీ రెండో రోజు ఆసక్తి పరిణామం జరిగింది. ఉదయం సభ ప్రారంభమైన తర్వాత ఎస్సీ కమిషన్ బిల్లును మంత్రి పినిపే విశ్వరూప్ ప్రవేశపెట్టారు. అనంతరం స్పీకర్ చర్చ ప్రారంభించగా.. సభ్యులు మాట్లాడారు. ఇదే సందర్భంలో టీడీపీ సభ్యులు రాజధాని వ్యవహారంపై నిరసన కొనసాగించారు. అమరావతికి అనుకూలంగా నినాదాలు చేశారు. స్పీకర్ పోడియం దగ్గరకు దూసుకెళ్లారు.. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది.టీడీపీ ఎమ్మెల్యేలు వెళ్లి సీట్లు కూర్చోవాలని స్పీకర్ తమ్మినేని సీతారాం కోరారు. అయినా వారు వెనక్కు తగ్గలేదు.. అక్కడే నిరసన తెలియజేశారు. దీంతో తమ్మినేని తీవ్రంగా స్పందించారు. టీడీపీ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్పీకర్ సభ నుంచి వెళ్లిపోయారు. టీడీపీ సభ్యుల తీరు సరిగా లేదని.. తాను మనస్తాపంతో ఉన్నానని అసహనాన్ని వ్యక్తం చేశారు. హెడ్ ఫోన్స్ పక్కన పెట్టి వెళ్లిపోయారు.దీంతో టీడీపీ సభ్యుల తీరుపై మంత్రులు, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతరం తెలియజేశారు. ఎస్సీలకు సంబంధించిన బిల్లుపై చర్చ జరగకుండా అడ్డుకోవడం దారుణమని మండిపడ్డారు. వారికి ఎస్సీలంటే గౌరవం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తర్వాత కొద్దిసేపటికి సభ వాయిదా పడింది. మళ్లీ సభ ప్రారంభమైన తర్వాత కూడా టీడీపీ ఎమ్మెల్యేలు తమ నిరసనల్ని కొనసాగించారు.
ప్రత్యేక ఎస్సీ కమిషన్ పై చర్చ
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభంకాగానే స్పీకర్ తమ్మినేని సీతారాం సభ్యులకు గుడ్ మార్నింగ్ చెప్పారు. వెంటనే స్పందించిన టీడీపీ ఎమ్మెల్యే బ్యాడ్ మార్నింగ్ అంటూ రిప్లై ఇచ్చారు. దీనికి కౌంటర్‌గా స్పీకర్.. కుక్క తోక వంకరని తమ సీఎం ఎప్పుడూ చెబుతుంటారన్నారు. ఉదయం ఎవరైనా గుడ్ మార్నింగ్ చెబుతారు.. 'మీ కర్మ.. బ్యాడ్‌మార్నింగ్' అన్నారు.రెండో రోజు సభ ప్రారంభంకాగానే మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి మృతికి సంతాపాన్ని తెలియజేశారు. సంతాప తీర్మానాన్ని స్పీకర్ చదివి వినిపించారు. బుజ్జి ఏలూరు నియోజకవర్గ అభివృద్ధికి తనవంతు కృషి చేశారని కొనియాడారు. ఆయన కుటుంబానికి సభ తరపున సానుభూతి, సంతాపాన్ని తెలియజేశారు. అనంతరం సభలో ప్రత్యేక ఎస్సీ కమిషన్ బిల్లును ప్రవేపెట్టి చర్చ కొనసాగిస్తున్నారు.ఇదిలా ఉంటే రెండో రోజు టీడీపీ సభ్యులు తమ నిరసనల్ని కొనసాగించారు. ప్రత్యేక ఎస్సీ కమిషన్ బిల్లు చర్చ జరుగుతున్న సమయంలో అమరావతికి అనుకూలంగా నినాదాలు చేశారు. స్పీకర్ టీడీపీ ఎమ్మెల్యేలను వారించినా వెనక్కు తగ్గలేదు. ఆ గందరగోళంలోనే చర్చను కొనసాగించగా.. సభ్యులు మాట్లాడారు.

Related Posts