బాలుడికి శృంగార పాఠాలు
అహ్మదాబాద్, జనవరి 21
పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఓ యువతి అత్యంత నీచానికి పాల్పడింది. చదువు నేర్చుకునేందుకు తన వద్దకు వచ్చిన విద్యార్థికి శృంగార పాఠాలు చెబుతూ అతడితో లైంగిక కోరికలు తీర్చుకోవడం మొదలుపెట్టింది. కొన్నాళ్లుగా రాసలీలలు సాగిస్తున్న టీచరమ్మ చివరికి ఆ విద్యార్థితో పరారు కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది.గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌కు చెందిన ఓ యువతి డిగ్రీ చదివి ఇంటి వద్దనే ట్యూషన్ చెబుతోంది. ఆమె వద్దకు ఎనిమిదో తరగతి చదువుతున్న 14ఏళ్ల కుర్రాడు కొద్దిరోజులుగా ట్యూషన్‌కు వస్తున్నాడు. సెక్స్ కోరికలు ఎక్కువగా ఉండే ఆమె ఆ బాలుడిపై కన్నేసింది. ట్యూషన్ ముగిసిన తర్వాత కూడా అతడిని పంపించకుండా తన గదిలోకి తీసుకెళ్లి రాసలీలలు కొనసాగించేది. చదువు చెప్పాల్సిన టీచరమ్మ చేస్తున్న పనులకు ముందుగా షాకైన అతడు కొద్దిరోజులకు ఆమె ట్రాప్‌లో పడిపోయాడు. దీంతో ఇద్దరూ రోజూ ట్యూషన్ ముగిశాక కామక్రీడల్లో మునిగి తేలేవారు.ఈ క్రమంలోనే తన కొడుకు కనిపించడం లేదని బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ట్యూషన్ టీచర్ తన కొడుకును లొంగదీసుకుని తీసుకెళ్లిపోయిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో టీచర్ వ్యవహార శైలిపై పోలీసులు విచారణ చేపట్టగా షాకిచ్చే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ట్యూషన్ టీచర్ ఆ బాలుడితో చాలా చనువుగా ఉండేదని, తమ ముందే గదిలోకి తీసుకెళ్లేదని కొందరు విద్యార్థులు పోలీసులకు చెప్పారు. దీంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.