YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 సీటు మార్చిన వల్లభనేని

 సీటు మార్చిన వల్లభనేని

 సీటు మార్చిన వల్లభనేని
విజయవాడ, జనవరి 21
ఏపీ అసెంబ్లీలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సీటు మార్చారు. మొన్నటి వరకు టీడీపీకి కేటాయించిన సీట్లలో కూర్చొన్న ఆయన.. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల రెండో రోజు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలకు కేటాయించిన సీట్లలో కూర్చున్నారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ పక్క సీట్లోకి వెళ్లి.. ఆయనతో కాసేపు ముచ్చటించారు. అలాగే టీడీపీ ఎమ్మెల్యేలు నిరసన తెలియజేస్తున్న సమయంలోనూ ఆయన హవభావాలు కాస్త మారాయి. సభ జరుగుతున్న సమయంలో కెమెరా ఆయన వైపు రెండు, మూడు సార్లు వెళ్లింది.మొదటి రోజు సమావేశాల్లో మాత్రం వల్లభనేని వంశీ టీడీపీకి కేటాయించిన సీట్లలో చివరి వరుసలో కూర్చున్నారు. ఆయన పక్కనే ఇటీవలే జగన్‌ను కలిసిన మరో ఎమ్మెల్యే మద్దాలి గిరి కూర్చున్నారు. కానీ రెండు రోజు మాత్రం వంశీ వెళ్లి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల కోసం కేటాయించిన సీట్లలో కూర్చోవడం ఆసక్తి కలిగించింది.వల్లభనేని వంశీ దీపావళి సమయంలో టీడీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తర్వాత పార్టీ నుంచి ఆయన్ను సస్పెండ్ చేశారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల సమయంలో ఆయన తనను ప్రత్యేక సభ్యుడిగా గుర్తించానలి.. తనకు సీటు కేటాయించాలని కోరారు. తనను టీడీపీ నుంచి ఎందుకు సస్పెండ్ చేశారో తెలియదని.. అధిష్టానం, నేతల తీరుతో విసిగిపోయానన్నారు. అందుకే తనను ప్రత్యేక సభ్యుడిగా గుర్తించాలని కోరారు. స్పీకర్ కూడా సానుకూలంగా స్పందించి... అవకాశం ఉన్న చోట సీటు కేటాయించాలని అసెంబ్లీ కార్యదర్శికి సూచించారు. ఇక మద్దాలి గిరికి ఏ సీటు కేటాయించారన్నది క్లారిటీ లే

Related Posts