YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 విపక్షాల రాద్దాంతం విచారకరం

 విపక్షాల రాద్దాంతం విచారకరం

 విపక్షాల రాద్దాంతం విచారకరం
అమరావతి జనవరి 21
ఎస్సీ, ఎస్టీ కమిషన్ బిల్లు గురించి మాట్లాడే సమయంలో తెలుగుదేశం పార్టీ సభ్యులు ఈ రకంగా రాద్ధాంతం చేయడమనేది విచారకరం. ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఎస్సీలకు, ఎస్టీలకు ఎంత వ్యతిరేకమనేది వీళ్ల నినాదాల బట్టే ఇవాళ అర్ధమవుతోందని ఉపముఖ్యమంత్రి  పుష్ప శ్రీవాణి అన్నారు. మంగళవారం ఆమె శాసనసభలో మాట్లాడుతూ వీళ్ల రాజకీయ స్వార్ధమే తప్ప, ప్రజల మేలు గానీ, ఎస్సీల, ఎస్టీల ప్రయోజనాలు గానీ వీళ్లకు అనవసరం అనేది ఈ సందర్భంగా అర్ధమవుతోంది. ఇవాళ ముఖ్యమంత్రి  ఎస్సీ, ఎస్టీ కమిషన్ అనేది కలిపి ఉన్నప్పుడు, ఎస్టీలకు అన్యాయం జరుగుతుందని అని గుర్తించి ఈరోజు ఎస్సీ,ఎస్టీ కమిషన్ బిల్లును సెపరేట్ చేయడానికి నిర్ణయం తీసుకున్నందుకు జగన్మోహన్ రెడ్డి కి యావత్ గిరిజనులు అందరూ ధన్యవాదములు చెప్పే పరిస్ధితి ఉందని అన్నారు. ఈరోజు ఎస్సీ, ఎస్టీ కమిషన్ బిల్లును ఎలాగైనా అడ్డుకోవాలనే  ఉద్దేశ్యంతో ఈ రోజు కౌన్సిల్లో ఎస్సీ వర్గీకరణ అనేది తెరమీదకి తీసుకొచ్చారు. ఇక్కడ కేవలం ఏంటంటే ఎస్సీల, ఎస్టీలకు మేలు జరగకూడదన్నది వీళ్ల ప్రధాన ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. ఈ రోజు ఎస్సీ వర్గీకరణ అని చెప్పి వీళ్లు ఎస్సీల మీద ఇంత ప్రేమ చూపించే విధంగా నటిస్తున్న తీరు గమనిస్తే... గతంలో చంద్రబాబునాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీలగా ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్నటువంటి పెద్ద మనిషి ఈయన అదే విధంగా ఆ రోజు వాళ్ల మంత్రివర్గంలో ఎస్సీ మంత్రిని మంత్రివర్గం నుంచి తొలగించిన ఘనత చంద్రబాబునాయుడుదేనని అన్నారు. అదేవిధంగా దళిత మహిళకు మంత్రిపదవినిచ్చి తర్వాత తొలగించిన ఘనత కూడా చంద్రబాబునాయుడిదే ఈరోజు మా ముఖ్యమంత్రి జగ న్మోహన్రెడ్డి గారు ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కాని ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారంటే, నామినేటెడ్ పదవుల్లో కానీ, నామినేషన్ వర్కుల్లో కానీ ఈరోజు ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం రిజర్వేషన్లలో భాగంగా అవకాశాలు వస్తున్నాయి,  ఎస్సీలు గానీ, ఎస్టీలు గానీ అర్ధికంగా పలుకుబడిలేనటువంటి పరిస్ధితులు ఉంటాయి, ఆ నేపధ్యలో రాజకీయ అవకాశాలు రానుటువంటి పరిస్ధితి వుంది. మాకొచ్చేటటువంటి రిజర్వేషన్లు, మాకిచ్చేటటువంటి 6శాతం రిజర్వేషన్లు కూడా మాకు కల్పించనటువంటి చరిత్రలు ఎన్నో ఉన్నాయని ఆమె అన్నారు. చంద్రబాబునాయుడు  ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీసం గిరిజనులకు మంత్రిపదవి కూడా నాలుగున్నరేళ్లు ఇవ్వకుండా..కేవలం ఎలెక్షన్ వస్తుంది, గిరిజనులుకు ఎక్కడ చెడ్డ అవుతామోనని కేవలం ఆరునెలల ముందు గిరిజనులకు మంత్రిపదవి ఇచ్చారు. అంటే గిరిజనుల హక్కులను కాలరాసినటువంటి ఘనత చంద్రబాబునాయుడుది. ఈరోజు మా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఎస్సీలకు, ఎస్టీలకు అన్నింటిలోనూ అవకాశాలిస్తున్నారు. ఈ రోజు చూస్తే మంత్రివర్గంలో ఐదుగురికి మంత్రిపదవులున్నాయి. దేశ రాజకీయ చరిత్రిలో ఏ రాజకీయ పార్టీ అయినా ఐదుగురికి మంత్రిపదవులిచ్చిన ఘనత లేదు, ఒక్క జగన్మోహన్రెడ్డి కి మాత్రమే అది చెల్లుతుందని అన్నారు. ఎస్సీల్లో ఒకరికి ఉపముఖ్యమంత్రి పదవినిచ్చారు, అదే విధంగా ఒక గిరిజన మహిళకు ఉపముఖ్యమంత్రి పదవినిచ్చారు.. అదీ ఎస్సీ, ఎస్టీలంటే చిత్తశుద్ధి. చంద్రబాబు నాయుడు  దళితులకు మంత్రిపదవినిచ్చి తొలగించిన చరిత్ర. గిరిజనులకు ఎంతో మేలు చేసే విధంగా, గిరిజన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న ఉద్దేశ్యంతోటి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ప్రతీ నిర్ణయం గొప్పవి. ఈ రోజు గిరిజనులు కలగనేవారు... గిరిజన ప్రాంతంలో మెడికల్ కాలేజీ అనేది, గిరిజన ప్రాంతంలో ఇంజనీరింగ్ కాలేజీ అనేది ఓ కల , గిరిజన ప్రాంతలో గిరిజన యూనివర్సీటీ అనేది కావాలని కలలుగనేవారు. గిరిజనులకు ఇంత మేలు చేసేటటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నిర్ణయాలను హర్షించడం మానేసి, ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ఎస్సీ, ఎస్టీ కమిషన్ బిల్లు విషయంలో వీళ్లు ఇంత రాద్ధాంతం చేస్తున్నారంటే వీళ్లకి కేవలం రాజకీయ ప్రయోజనాలు మాత్రమే ముఖ్యం, ఎస్సీ, ఎస్టీల ప్రయోజనాలు ముఖ్యం కాదని దీని ద్వారా అర్ధమవుతుందని అన్నారు. 

Related Posts