మూసుకున్న అయ్యప్ప ఆలయ తలుపులు
తిరువనంతపురం జనవరి 21
మండలం, మకరవిళక్కు సీజన్ పూర్తైన నేపథ్యంలో శబరిమల అయ్యప్ప ఆలయద్వారాలు మూతపడ్డాయి. ప్రధాన పూజారి నేతృత్వంలో మహాగణపతి హోమం, అభిషేకం, ఉషా నైవేద్యం తదితర పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించిన తరువాత ఆలయద్వారాలు మూసివేశారు. మండలం సీజన్ సందర్భంగా 2 నెలలపాటు అయ్యప్ప భక్తులకు దర్శనమిచ్చారు. మకరవిళక్కు జనవరి 15 తేదీనే పూర్తైనప్పటికీ.. భక్తుల దర్శనార్థం సోమవారం వరకు ఆలయ ద్వారాలు తెరిచేఉంచారు. ఆఖరిరోజున అయ్యప్ప దర్శనానికి భక్తులు పోటెత్తారు. మాసపూజల కోసం ఫిబ్రవరి 13న ఆలయద్వారాలు తెరవనున్నారు. ఐదురోజుల పాటు అయ్యప్ప.. భక్తులకు దర్శనమివ్వనున్నారు.