తెలుగు అభిమానులకు IPL-11 ను మరింత చేరువ చేసేందుకు ఎన్టీఆర్ స్టార్ డమ్ ఉపయోగించుకోవాలని స్టార్ స్పోర్ట్స్ భావిస్తోందట. వచ్చే ఐదేళ్ల కాలానికి IPL ప్రసార హక్కులను స్టార్ స్పోర్ట్స్ దక్కించుకోగా.. ఇందుకు బ్రాండ్ అంబాసిడర్ గా తారక్ ను నియమించుకోవాలని యోచిస్తోందట. ఎన్టీఆర్ తో మ్యాచ్లకు సంబంధించి ప్రోమోలు విడుదల చేసేందుకు స్టార్ మా ప్లాన్ చేస్తోందట. కాగా స్టార్ మా 'బిగ్ బాస్' కు తారక్ హోస్టుగా వ్యవహరించిన విషయం తెలిసిందే.