YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 ఏపీ కేబినెట్ భేటీ,.. మండలి రద్దు దిశగా అడుగులు

 ఏపీ కేబినెట్ భేటీ,.. మండలి రద్దు దిశగా అడుగులు

 ఏపీ కేబినెట్ భేటీ,.. మండలి రద్దు దిశగా అడుగులు
విజయవాడ, జనవరి 21, 
మూడు రాజధానుల అంశం ఏపీలో కాకరేపుతోంది. అసెంబ్లీలో బిల్లుకు ఓకే చెప్పినా.. మండలిలో అడ్డంకులు ఎదురవుతున్నాయి. బిల్లును మండలిలో ప్రవేశపెట్టినా టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో వైఎస్సార్‌సీపీ సర్కార్‌కు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. టీడీపీ రూల్ 71 కింద నోటీస్ ఇవ్వడంతో బిల్లుకు బ్రేకులు పడ్డాయి. దీంతో మంత్రులు ఛైర్మన్ ఛాంబర్‌ దగ్గరకు వెళ్లి అభ్యంతరం తెలిపారు.మండలిలో బిల్లుకు అడ్డంకులు ఏర్పడటంతో ప్రభుత్వం సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తుందనే ప్రచారం మొదలయ్యింది. శాసనమండలిని రద్దు చేసే ఆలోచనలో ఉన్నట్లు అమరావతిలో చర్చ జరుగుతోంది. మండలిని రద్దు చేసి అడ్డంకుల్ని తొలగించుకోవాలని జగన్ సర్కార్ భావిస్తోందట. అందుకే మంగళవారం రాత్రి కేబినెట్ అత్యవసర సమావేశం నిర్వహించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అసెంబ్లీ కార్యదర్శికి మండలి రద్దుకు సంబంధించి లేఖను ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.ఇదిలా ఉంటే మండలి రద్దు చేస్తారనే ఊహాగానాలపై టీడీపీ స్పందించింది. శాసన మండలి రద్దు అంత సులభం కాదని మాజీ మంత్రి యనమల అంటున్నారు. పార్లమెంట్‌ నిర్ణయంతోనే మండలి రద్దు సాధ్యమవుతుందని.. కనీసం ఏడాది సమయం పడుతుందని చెప్పుకొచ్చారు. ఒకవేళ ప్రభుత్వం మండలి రద్దు దిశగా అడుగులు వేస్తే అది అప్రజాస్వామికమని లోకేష్ అంటున్నారు. రద్దు చేసినా ఇబ్బంది లేదని.. తాము భయపడేది లేదన్నారు.

Related Posts